Andhra Pradesh Assemblyమొట్టమొదటి రోజు నుండి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అట్టుడికిపోయింది. మొదటి రోజే ఏకంగా చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుని సస్పెండ్ చెయ్యడం… తన రాజకీయ ప్రస్థానంలో ఎప్పుడు లేనట్టుగా ఆయన స్పీకర్ పోడియం ముందు బయటాయించడం వంటి సీన్లు చోటు చేసుకున్నాయి.

అసెంబ్లీలో గతంలో ఎప్పుడు లేనట్టుగా మీడియా ను అనుమతించలేదు. మీడియా పాయింట్ కూడా ప్రభుత్వం రద్దు చేసింది. సస్పెండ్ అయ్యాకా సభ ప్రాంగణంలో టీడీపీ నిరసనను తమ ఫోన్లలో చిత్రకరిస్తున్న ఎమ్మెల్యేలను కూడా భద్రతా సిబ్బంది అడ్డుకుంది. మండలిలో మంత్రులు గలాటా చేస్తుంటే దానిని చిత్రీకరించే ప్రయత్నం చేసిన లోకేష్ పై అధికారపక్షం విరుచుకుపడింది.

సభ్యులు తమ మొబైల్ ఫోన్లు బయటపెట్టేలా కొత్త రూల్ తీసుకురావాలని మంత్రులు డిమాండ్ చెయ్యడం విశేషం. గతంలో ఎన్నడూ లేనట్టుగా మీడియాను అనుమతించకపోవడం… అసెంబ్లీ లాబీలలో కూడా ఫోన్లు వద్దు అనడం… సభలోకి ఫోన్ తీసుకుని రావ్వదనడం విచిత్రం అనే చెప్పుకోవాలి. అసలు ఏం దాచాలని ప్రభుత్వం ఇదంతా చేస్తుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

ఇది ఇలా ఉండగా రెండో రోజు సభలో కూడా రగడ చోటుచేసుకుంది. స్పీకర్ తమ్మినేని, చంద్రబాబు మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఇళ్ల స్థలాల కేటాయింపుపై ఏపీ అసెంబ్లీలో అధికారపక్ష సభ్యుల వ్యాఖ్యలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు బెదిరింపులకు భయపడనని స్పీకర్ తమ్మినేని అన్నారు.