MM Keeravaniమొన్న ఆ మధ్య రాజమౌళి, కీరవాణీల కుటుంబాలు కరోనా వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే వారు తొందరగానే దాని నుండి కోరుకున్నారు. కరోనా బారిన పడిన నాడే వారు తమ ప్లాస్మా డొనేట్ చేస్తామని ప్రకటించారు. అన్నట్టుగానే ఈరోజు సంగత దర్శకుడు కీరవాణి ఆయన తనయుడు యువ సంగీత దర్శకుడు కాలభైరవ కూడా ప్లాస్మా డొనేట్ చేశారు.

ఈరోజు హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రికి చేరుకొని తన ప్లాస్మా ఇచ్చారు. ప్లాస్మా ఇవ్వడం అనేది రక్త దానం వంటిదే అని.. దాని గురించి అపోహలు వద్దని… ఎమర్జెన్సీ అయ్యేవరకు వేచి చూడకుండా వెంటనే కరోనా నుండికోలుకున్న వారు ప్లాస్మా దానం చెయ్యాలని కీరవాణి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

కీరవాణి మిగతా కుటుంబ సభ్యులు… అలాగే రాజమౌళి కుటుంబ సభ్యులు కూడా త్వరలో తమ ప్లాస్మా డొనేట్ చెయ్యనున్నట్టు సమాచారం. కరోనా తగ్గించడానికి నిర్దిష్టమైన చికిత్స ఏదీ లేకపోయినా చాలా మందిలో కరోనా నుండి కోలుకున్న వారి ప్లాస్మా కారణంగా కరోనా ప్రభావం తగ్గినట్టుగా డాక్టర్లు చెబుతున్నారు.

అయితే అనేక అపోహల కారణంగా చాలా మంది అందుకు ముందుకు రావడం లేదు. సెలబ్రిటీలు ముందుకు వచ్చి ప్లాస్మా డొనేషన్ గురించి ప్రచారం చెయ్యడం, కరోనా బారిన పడి కోలుకున్న వారు ప్లాస్మా దానం చెయ్యడానికి ముందుకు వస్తే ప్రజలు మరింతగా జాగృతం అవుతారు.