mlc pothula suneethays joining jagan ysrcpఎన్నికల ముందు తమపార్టీలోకి వేరే పార్టీ ఎమ్మెల్యేలు వస్తే రాజీనామా చేసి రావాల్సిందే అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పేవారు. విలువలు, విశ్వసనీయత అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పి… అధికారంలోకి వచ్చాకా రాజీనామాలు లేకుండానే పార్టీలోకి చేర్చుకుంటున్నారు. ఎమ్మెల్యేలకు కండువా కప్పకుండా వారి కుమారులకు కప్పి అనర్హత వేటు తప్పించుకుంటున్నారు.

శాసనసభలో ఎక్కడా లేనట్టుగా వారిని స్వతంత్రులుగా కూర్చోబెడుతున్నారు. ఎమ్మెల్యేలు అంటే ఉపఎన్నికలు ఎదురుకునే ఓపిక లేక అనుకోవచ్చు ఎమ్మెల్సీల విషయంలోనూ జగన్ అంతే చేస్తున్నారు. టీడీపీ నుండి వైఎస్సార్ కాంగ్రెస్ లో చేర్చుకున్న పోతుల సునీత రాజీనామా చేశారు. రాజీనామా లేఖలో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు టీడీపీ అడ్డుపడుతోందని సునీత ఆరోపించారు.

అందుకే టీడీపీ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. జగన్‌ నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు పోతుల సునీత స్పష్టం చేశారు. పేరుకి రాజీనామా చేశారు గానీ శాసనమండలి రూల్స్ ప్రకారం నిర్ణీత ఫార్మటు లో ఇస్తే గానే రాజీనామా ఆమోదించరు. ఏకవాక్యంలో రాజీనామా చేస్తున్నట్టు చెప్పాలి.

కారణాలు వంటివి పేర్కొంటే అవి చెల్లవు. అయితే ఇప్పటికే పోతుల సునీతపై టీడీపీ అనర్హత పిటిషన్‌ వేసింది. మండలి చైర్మన్‌ దగ్గర అనర్హత పిటిషన్‌ విచారణలో ఉంది. తన ఉద్దేశం స్పష్టంగా చెప్పడంతో రాజీనామా విషయంలో నిర్ణయం తీసుకోలేకపోయినా అనర్హత పిటిషన్ లో దీనిని సాక్ష్యంగా తీసుకుని ఆమెను అనర్హురాలిగా చెయ్యవచ్చు