MLC Pilli Subashchandra Bose - MLC Mopidevi Venkata Ramanaమండలి రద్దుని సిఫార్సు చేస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చేసిన తీర్మానం ఇప్పటికే కేంద్రానికి చేరింది. ఇప్పుడు బంతి కేంద్రం కోర్టులో ఉంది. ఆ తీర్మానాన్ని కేంద్ర కేబినెట్ పాస్ చేసి పార్లమెంట్ లో బిల్లు పెట్టాల్సి ఉంది. అక్కడ పాస్ అయితే ప్రెసిడెంట్ ఆమోదముద్ర వేస్తారు. అప్పుడే మండలి అధికారికంగా రద్దు అవుతుంది.

అయితే ప్రస్తుతం జగన్ కాబినెట్ లో ఇద్దరు మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ మండలిలో సభ్యులుగా ఉన్నారు. శాసనసభలో తీర్మానం పాస్ అయిన వెంటనే వారు రాజీనామా చేస్తారని ప్రచారం జరిగింది అయితే అటువంటిది ఏమీ జరగలేదు. ఈ విషయంలో వేచి చూసే ధోరణి అవలంబిద్దామని జగన్ అనుకుంటున్నారట.

తాజాగా ఎప్పుడు మండలి రద్దు అయితే ,అదే రోజు తాము రాజీనామా చేయడానికి సిద్దంగా ఉన్నామని మంత్రి మోపిదేవి వెంకటరమణ ప్రకటించారు. పార్లమెంటులో ఆమోదం పొంది, రాష్ట్రపతి ఆమోద ముద్ర పడిన వెంటనే తప్పుకుంటామని ఆయన అంటున్నారు. పైగా కౌన్సిల్ రద్దు తీర్మానం చేయగానే మంత్రులు రాజీనామా చేయాలని నిబందన ఉంటే అలాగే చేస్తామని ఆయన అన్నారు.

అయితే టీడీపీ వారు మాత్రం దీనిని ఆక్షేపిస్తున్నారు. “రాష్ట్ర ప్రయోజనాల కోసం పదవులకు రాజీనామా అంటూ బిల్డ్ అప్ ఇచ్చారు. మండలి రద్దు అయ్యాక వాళ్ళు రాజీనామా చెయ్యడం ఏంటి? రాజీనామా చెయ్యక తప్పని పరిస్థితులు అప్పుడే వస్తాయి. ఈ మాత్రం దానికి అంత బిల్డ్ అప్ ఎందుకో, అంటూ వారు ఎద్దేవా చేస్తున్నారు.