MLA Roja - Pawan Kalyan!జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వ్యక్తిగత దూషణలు చేయడం మంచిది కాదని వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజా అన్నారు. ఆదివారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కాస్టింగ్‌ కౌచ్‌పై ఇప్పటి వరకు ఫిర్యాదులు లేవని అన్నారు. ఎవరికైనా ఇబ్బందులెదురైతే నేరుగా ఫిర్యాదు చేయొచ్చునని, స్వలాభం కోసం చిత్రపరిశ్రమపై విమర్శలు చేయడం సరికాదని రోజా వ్యాఖ్యానించారు.

అయితే రోజా పవన్ కళ్యాణ్, చిరంజీవిలను విమర్శిస్తున్న వీడియో ఒకటి హుల్ చల్ చేస్తుంది. ఆ వీడియోలో చిరంజీవిని విమర్శిస్తూ నీ తమ్ముడు ఇండస్ట్రీలో ఎంత మందితో పడుకున్నాడో శ్వేత పత్రం విడుదల చేస్తారా అని రోజా నీతి బాహ్యమైన విమర్శలు చేసారు రోజా అప్పట్లో. సడన్ గా పవన్ కళ్యాణ్ టీడీపీకి వ్యతిరేకంగా మారడంతో రోజాలో మార్పు వచ్చినట్టు ఉంది.

మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ అమ్మలను అక్కలను అన్నారని మాటలు అంటే తాము చూస్తూ ఊరుకోమని పరిశ్రమ అంతా ఒక్కటయ్యి చంద్రబాబు నాయుడుకు బుద్ధి చెబుతామని రోజా చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్, మెగా ఫ్యామిలీ మంచితనం రోజాకు టీడీపీకి ఎదురు వెళ్తేగానీ తెలియలేదన్నమాట.