roja suspension high court caseవైసీపీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్‌ వ్యవహారంపై హైకోర్టు తీర్పు ప్రకటించిన అనంతరం టీడీపీ ఎమ్మెల్యే అనిత ప్రసంగిస్తూ… ఈ రోజు తనకెంతో శుభదినమని, అహంకారం ఎంత దారుణంగా ఓడుతుందో ఈ రోజు తెలిసిందని అన్నారు. ‘అహంకారం ఓడిందని… తన ఆవేదన గెలిచిందని,’ దళితుల ఆత్మగౌరవం నిలబడిందని, ప్రతిపక్ష నాయకుడిది అవగాహనా రాహిత్యం అనుకున్నాం కానీ… ఇంకా కుర్రతనం పోలేదు మా అన్నకి…” అంటూ జగన్‌ను ఉద్దేశించి ఛలోక్తులు విసిరారు అనిత. ఇప్పటికైనా జగన్‌కు కనువిప్పు కలగాలని, సభా హక్కులను కాపాడినందుకు హైకోర్టుకు ధన్యవాదాలు చెప్పారు.

ఇదిలా ఉంటే.., డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పు యావత్తు మహిళలు గర్వించదగినదని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ అభివర్ణించారు. వైఎస్సార్సీపీకి చెందిన మరో ఎమ్మెల్యే కొడాలి నానిపై కూడా ఏడాది పాటు వేటు వేయాలని, ప్రభుత్వం ఉదాశీనంగా వ్యవహరించినందు వల్లే ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరయ్యే అవకాశం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు కల్పించిందని అన్నారు. వైఎస్సార్సీపీ విప్ జారీ చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ, ఆ విప్ కు ఎటువంటి విలువ లేదని, ద్రవ్య వినిమయ బిల్లకు వ్యతిరేకంగా వారు ఓటు వేసినా ఎటువంటి నష్టం వాటిల్లదని బొండా ఉమా ప్రస్తావించారు.