supreme court shocks to YSRCP MLA rojaఅసెంబ్లీ సాక్షిగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో పాటు స్పీకర్ కోడెల శివప్రసాద్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి ఏడాది పాటు సస్పెన్షన్ కు గురైన వైసీపీ ఫైర్ బ్రాండ్, చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా వ్యవహారంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో నేడు కీలక విచారణ జరగనుంది.

“తన సస్పెన్షన్ రాజ్యాంగ విరుద్ధమని వాదిస్తూ, సస్పెన్షన్ ఎత్తివేయాలని” రోజా దాఖలు చేసిన పిటిషన్ పై ఇప్పటికే గతవారం ద్విసభ్య ధర్మాసనం విచారణకు తిరస్కరించిన సంగతి తెలిసిందే. రోజా పిటిషన్ ను విచారించలేమని చెప్పిన జస్టిస్ ఖేహార్, జస్టిస్ నాగప్పన్ లతో కూడిన ధర్మాసనం, పిటిషన్ ను మరో బెంచ్ కు బదిలీ చేస్తున్నామని ప్రకటించింది.

నేడు ఈ పిటిషన్ పై రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టే అవకాశాలు ఉన్నాయని న్యాయవాద వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన రోజా, విచారణ పూర్తి కాకముందే తన పిటిషన్ ను ఉపసంహరించుకుని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులోనైనా రోజాకు ఊరట లభిస్తుందా? అన్న విషయం ఆసక్తికరంగా మారింది.