MLA Roja cries infront of Privilege Committee.ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ ఫైర్ బ్రాండ్ గా పేరొందించ నగరి ఎమ్మెల్యే రోజా కన్నీరు పెట్టుకున్నారు. గ్రూపు రాజకీయాల కారణంగా తనకు ప్రొటోకాల్ ప్రకారం తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని.. శాసనసభ ప్రివిలైజ్ కమిటీ ఎదుట బోరున విలపించారు. టీటీడీలో కూడా ఇదే పరిస్థితి ఉందని ఫిర్యాదు చేశారు. ఎన్ని కమిటీలు వచ్చినా, ఎంత మందికి చెప్పుకున్నా.. పట్టించుకోవడం లేదంటూ వాపోయారు.

సొంత నియోజకవర్గంలో ఇళ్ల పంపిణీ కార్యక్రమం జరిగినా… రోజాకు సమాచారం అందించలేదు. దానితో ఆమె అవమానంగా ఫీల్ అయ్యారట. దీంతో ఆమె నొచ్చుకుని.. ప్రివిలైజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఇలా జరగడం మొదటి సారి కాదని, ప్రొటోకాల్ ప్రకారం అధికార కార్యక్రమాలకు పిలవకపోవడం పరిపాటి అయిపోయిందని ఆమె చెప్పుకుని విలపించారు.

సొంత పార్టీ అధికారంలో ఉండగా… తనకు దక్కాల్సిన గౌరవం దక్కడం లేదని.. సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని అధికారులపై ఫిర్యాదు చేశారు. శాసనసభ సభ్యురాలిగా ప్రొటోకాల్ ప్రకారం అన్నీ సవ్యంగా జరిగేలా చూడాలని కమిటీని కోరారు. సహజంగా ఇటువంటి వాటిలో అధికారుల ప్రమేయం ఉండదు జిల్లాలోని పెద్ద తలకాయలు ఎలా చెబితే అలా నడుచుకుంటారు.

దానితో సొంత పార్టీ వారే రోజా ని ఇబ్బంది పెడుతున్నట్టు అర్ధం అవుతుంది. ప్రతిపక్షంలో పార్టీ తరపున నిలబడి అనేక ఇబ్బందులు పడిన రోజా అధికారంలోకి వచ్చినా పరిస్థితి మారకపోవడం మింగుడుపడటం లేదు. మంత్రిని చేస్తారని ఎక్సపెక్ట్ చేస్తే కేవలం నామినేటెడ్ పోస్టుతో సరిపెట్టారు జగన్ అందుకే ఈ పరిస్థితి దాపురించిందని ఆమె సన్నిహితుల దగ్గర వాపోతున్నారట.