MLA-Jaleel-Khan-MPC-in-matriculationవిజయవాడ పశ్చిమ నియోజకవర్గపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ చేసిన ‘బీకాంలో ఫిజిక్స్’ వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో మరియు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే అదే జలీల్ ఖాన్ నోటి నుంచి బీకాంలో ఫిజిక్స్ పై సరికొత్త వ్యాఖ్య వెలువడి నవ్వులు పూయిస్తోంది. ‘సోషల్ మీడియా ఇంటర్వ్యూలో తాను చెప్పింది పెట్టకుండా… ఆయన క్లబ్ చేసి, మిక్స్ చేసి, తాను అననిది అనినట్టు రూపొందించారని’ ఇటీవల ఓ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న జలీల్ ఖాన్ తన వ్యాఖ్యలను సమర్ధించుకున్నారు.

దీంతో ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి… ‘అసలు బీకాంలో ఫిజిక్స్ ఉందా?’ అని అడుగగా ఆయన సమాధానమిస్తూ… ‘అసలు నేను అన్లా… అది…’ అంటూ చెప్పబోయేంతలో ఆ ‘ఇంటర్వ్యూ నేను చూశాను… మీరేమన్నారో విన్నాను… ఇప్పుడు చెప్పండి…’ అని ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి అడగడంతో… జలీల్ ఖాన్ మళ్లీ వివరణ ఇస్తూ… ‘నేను మెట్రిక్యులేషన్ పాసయ్యాను’ అని అన్నప్పుడు, ‘ఇంత మంచి మార్కులతో సెకెండ్ క్లాస్ లో పాసయ్యారు కదా హయ్యర్ స్టడీస్ చెయ్యాలనుకోలేదా? అసలు చదివితే ఏం చదవాలనుకుంటున్నారు?’ అని యాంకర్ ప్రశ్నించగా…

దీనికి అప్పుడు నేను… బీకాం చదివేవాడినని అన్నాను. మెట్రిక్యులేషన్ లో నేను ఎంపీసీ గ్రూపు చదివాను కదా… అని నాలుక కరుచుకున్న జలీల్ ఖాన్, ఆ వెంటనే ‘కాదు.. పీయూసీలో ఎంపీసీ గ్రూపు… అది కూడా 30 సంవత్సరాల తరువాత అడిగితే ఏం గుర్తుంటుంది? మొన్ననే జగన్మోహన్ రెడ్డిగారు రెండు 28లు 64 అన్నారు. దానిని ఎవరూ పట్టించుకోలేదు… రాష్ట్రానికి ఇంకా పెద్ద సమస్యలు ఉన్నాయి… వాటిని పట్టించుకోవాలి…’ అని తన వ్యాఖ్యలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వొద్దని, లైట్ గా తీసుకోమన్నారు.