Bonda Uma, Bonda Uma Koganti Satyam Fight, Bonda Uma Koganti Satyam Verbal Fight, MLA Bonda Uma Koganti Satyam Fight, MLA Bonda Uma Koganti Satyam Verbal Fight, MLA Bonda Uma Industrialist Koganti Satyam Verbal Fightవిజయవాడలో ‘డూండీ గణేష్ సేవా సమితి’ పేరుతో గతేడాది 63 అడుగుల విగ్రహం ఏర్పాటు చేశారు. దీనికి విశేషమైన పేరు ప్రతిష్ఠలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది డూండీ గణేష్ ఉత్సవ సమితి పేరుతో కొత్త కమిటీ ఏర్పాటైంది. కమిటీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే బోండా ఉమ ఎన్నిక కాగా, కార్యవర్గానికి పలువురు టీడీపీ నేతలను ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో బోండా ఉమ మాట్లాడుతూ, ఈ ఏడాది 72 అడుగుల ఎత్తుతో గణేష్ విగ్రహం ఏర్పాటు చేశామని, ఈ ఏడాది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని తెలిపారు.

అయితే దీనిపై పారిశ్రామిక వేత్త కోగంటి సత్యం మాట్లాడుతూ… ఈ విషయం వారం రోజుల క్రితం చెబితే తాను 15 లక్షల రూపాయలు ఖర్చు చేసేవాడిని కాదని అన్నారు. తన మోచేతి నీళ్లు తాగి బతికిన బోండా ఉమ, ఇప్పుడు కొత్తగా ఉత్సవ కమిటీ అంటున్నారని, ఉత్సవ కమిటీ పేరుతో హుండీ ఏర్పాటు చేసేందుకు, అభిషేకాల పేరుతో డబ్బులు వసూలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. ఇలా మీడియా వేదికగా జరిగిన విమర్శలు – ప్రతివిమర్శలను దృష్టిలో పెట్టుకున్న ఓ మీడియా ఛానల్ ఇద్దరినీ ప్రత్యక్షంగా ‘లైవ్’లోకి తీసుకువచ్చింది.

ఇక అంతే… ఒకరిపై ఒకరు లైవ్ లోనే చెలరేగిపోయారు. ‘నువ్వు రౌడీ అంటే కాదు నువ్వే రౌడీ’ అంటూ ఆరోపణలు చేసుకున్నారు. బోండా ఉమా వర్సెస్ కోగంటి సత్యం మధ్య జరిగిన ఆ వాగ్వివాదం క్లుప్తంగా…
బోండా ఉమ: నువ్వు ఎన్నిసార్లు జైలు కెళ్లావో చెప్పాలి
కోగంటి సత్యం: నా మీద ఒకే ఒక్క కేసు ఉంది… ఆ కేసు కూడా ఎందుకు ఉందంటే… నీ మీదున్న రౌడీ షీట్ ను అప్పటి సీఐ రామారావు కాళ్లు పట్టుకుని నువ్వు తీయించుకున్నావు. నేను అతని కాళ్లు పట్టుకోలేదు. దీంతో నా పైన కేసుంది, లేకపోతే ఆ కేసు కూడా ఉండేది కాదు.
ఉమ: నువ్వు రౌడీవని పోలీసుల రికార్డులే చెబుతున్నాయి… నీపై మర్డర్ కేసులున్నాయి
సత్యం: నువ్వు నా కుర్రాడివా? కాదా? అది ముందు చెప్పు
ఉమ: నేను నీ దగ్గర పని చేశానా? నువ్వు నా దగ్గర గుమస్తాగా పని చేశావా?
సత్యం: ఎవరు ఎవరి దగ్గర పని చేశారో విజయవాడలో అందరికీ తెలుసు… నేను నీ దగ్గర పని చేశానా?… నా పేరు చెప్పుకుని నువ్వు ఎన్నో సెటిల్ మెంట్లు చేసి డబ్బులు సంపాదించుకున్నది నిజం కాదా?
ఉమ: దేవుడి కార్యక్రమంలో రాజకీయాలకు తావులేదు… వారు వారు చేసుకుంటే వివాదం ఏముంది?
సత్యం: ప్రజా ప్రతినిధిగా నువ్వు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి… అలా కాకుండా నువ్వు మధ్యలో కల్పించుకుంటే ఎలా?
ఉమ: ఇందులో రాజకీయం లేదా? నీ జీవితం గురించి నాకు చెప్పకు… నీ గురించి నాకు తెలియనివి ఉన్నాయా?
సత్యం: నేను షోడాలు అమ్ముకుని జీవితంలో పైకి వచ్చాను… నువ్వు నాలాంటోళ్ల దగ్గర పని చేసి ఎదిగావు
ఉమ: ఇప్పటికైనా మారు… రౌడీయిజం మానేయ్… నా నియోజకవర్గంలో రౌడీయిజానికి తావు లేదు
సత్యం: నువ్వు రాజకీయ రౌడీవయ్యావు… నన్ను రౌడీ అంటావా?
ఉమ: నేను 30,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాను
సత్యం: అది నీ గొప్పతనం కాదు… చంద్రబాబు వల్ల నీకు లభించింది… అలా కాదు, నీ సత్తాతో గెలిచానని అనుకుంటే… ఇప్పుడు నీ పదవికి రాజీనామా చేసిరా… ఇద్దరం స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేద్దాం… ఎవరు గెలుస్తారో తెలిసిపోతుంది.