MK Stalin - KCR Meet Failsఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటులో భాగంగా ఇటీవల కేరళ ముఖ్యమంత్రి విజయన్‌తో భేటీ అయిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిన్న హుటాహుటిన స్పెషల్ ఫ్లైట్ లో చెన్నై వెళ్ళి డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో సమావేశమయ్యారు. అయితే ఈ భేటీపై స్టాలిన్‌ ఇవాళ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫ్రంట్‌ ఏర్పాటు చర్చల కోసం కేసీఆర్‌ చెన్నై రాలేదని, దైవ దర్శనాల కోసమే వచ్చారని వ్యాఖ్యానించారు. ఈక్రమంలోనే తనను మర్యాదపూర్వకంగా కలిశారని చెప్పారు.

అదే సమయంలో లోక్‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌, బీజేపీయేతర ఫ్రంట్‌ ఏర్పాటుకు అవకాశాలు ఉంటాయని తాను అనుకోవడం లేదని స్టాలిన్‌ అన్నారు. ఇటీవలే కేసీఆర్ ఫ్యామిలీతో పాటుగా తమిళనాడులో వివిధ దేవాలయాలు సందరించుకుని హైదరాబాద్ తిరిగి వచ్చారు. తిరిగి రాగానే స్టాలిన్ అపాయింట్మెంట్ కంఫర్మ్ కావడంతో మళ్ళి తన సహచరులతో చెన్నై వెళ్లారు. ఇప్పుడు స్టాలిన్ ఏకంగా అది అసలు రాజకీయ సమావేశమే కాదనడం విశేషం. తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయి.

అటువంటి తరుణంలో మొదట్లో అసలు కేసీఆర్ ను కలవడానికి స్టాలిన్ ఇష్టపడలేదని వార్తలు వచ్చాయి. అయితే స్టాలిన్ కేసీఆర్ కు అపాయింట్మెంట్ నిరాకరించారని జాతీయ మీడియాలో కూడా వార్తలు వచ్చిన నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి వివిధ మార్గాలలో ఒత్తిడి చేసి అపాయింట్మెంట్ సాధించారు. అయితే చూడబోతే అది పెద్దగా ఉపయోగం లేదనే చెప్పుకోవాలి. మొత్తానికి స్టాలిన్ కేసీఆర్ గాలి తీసేశారు. కేసీఆర్ కూడా కాంగ్రెస్ పక్షాలైన డీఎంకే, జేడీఎస్ తో మంతనాలు జరపడం నైతికం కాదని తెలుసుకుంటే మేలని కాంగ్రెస్ పక్షాలు అభిప్రాయపడుతున్నాయి.