Mirzya teaserప్రముఖుల రియల్ జీవిత గాధలను తెరకెక్కించడంలో బాలీవుడ్ సినీ ప్రముఖులు ఎక్కువగా ఆసక్తి కనపరుస్తున్నారు. ప్రేక్షకులు కూడా ఇలాంటి సినిమాలకు పట్టం కడుతుండడంతో బాలీవుడ్ వర్గాలు వీరగాధలన్నీ వెలికితీసే పనిలో పడ్డారు. ఆ క్రమంలోనే స్పూర్తిదాయకమైన ‘మీర్జ్యా – సాహిబాన్’ల చారిత్రక కధతో “మీర్జ్యా” రూపుదిద్దుకుంటోంది. తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్.

ఇటీవల విడుదలైన ‘బాజీరావు మస్తానీ’ సినిమా తరహాలో ఒక ప్రేమగాధతో తెరకెక్కిన ఈ “మీర్జ్యా”లో గత తరంతో పాటు ప్రస్తుత తరం కూడా చూపిస్తుండడంతో ‘మగధీర’ మాదిరి కనెక్షన్ ఉంటుందని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. ఆనాటి కత్తుల నుండి నేటి గన్ల వరకు ట్రైలర్ లో చూపించారు. బ్యాక్ గ్రౌండ్ సంగీతం, ఫోటోగ్రఫీ అంశాలు ట్రైలర్లో హైలైట్స్ కాగా, సినిమాలో ఏ ఒక్కరి ముఖాలు కూడా స్పష్టంగా కనపడనివ్వక పోవడం సినీ ప్రేక్షకులకు నిరుత్సాహం కలిగించే విషయం.

మొత్తమ్మీద వీక్షకులను ఆకట్టుకునే విధంగా ట్రైలర్ ను కట్ చేసారు చిత్ర బృందం సక్సెస్ అయ్యింది. అక్టోబర్ 7వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమాలో హర్షవర్ధన్ కపూర్, సైయామి ఖేర్, అనూజ్ చుధరిలు ప్రధాన పాత్రల్లో నటించారు. ఓం ప్రకాష్ మెహ్రా స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ఈ సినిమా నిర్మాణం జరుగుతోంది.