Tollywood Top 10 Telugu Celebrities April 2023ప్రతి నెల అత్యంత ప్రభావం చూపించిన టాప్ టెన్ సెలబ్రిటీల గురించి మిర్చి 9 ఇస్తున్న ప్రత్యేక విశ్లేషణ ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల నుంచి బ్రహ్మాండమైన స్పందన దక్కించుకుంది. సహేతుకమైన కారణాలతో వాళ్ళు ట్రెండింగ్ లో ఉండేందుకు దారి తీసిన పరిస్థితుల గురించి వివరణ తదితరాలు చదువరులను ఆకట్టుకుంటున్నాయి. ఏప్రిల్ నెలలో ఎవరెవరు ఉన్నారో చూద్దాం

1. రజనీకాంత్

Also Read – అప్పుడు బెదిరించి, ఇప్పుడు బకాయిలు చెల్లించేశారట!

సినిమాలతో సంబంధం లేకుండా మొదటిసారి సూపర్ స్టార్ రజనీకాంత్ హాట్ టాపిక్ గా మారారు. విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు అతిథిగా విచ్చేసి కేవలం చంద్రబాబునాయుడుని ప్రశంసించిన కారణంగా వైసిపీ మంత్రులతో ఆమోదయోగ్యం కాని భాషలో మాటలు పడాల్సి వచ్చింది. ఆఖరికి ఒకప్పుడు ఆయనతో కలిసి నటించిన రోజా సైతం పార్టీ ప్రయోజనాల కోసం రజనిని విమర్శించడం పట్ల అభిమానులు ఫైర్ అవుతున్నారు. వైసిపి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు

2. అఖిల్ అక్కినేని

Also Read – రాజకీయ బలిపశువులుగా ఐఏఎస్, ఐపిఎస్‌ అధికారులు!

ఏజెంట్ కోసం ఒళ్ళు హూనం చేసుకుని విపరీతంగా కష్టపడినా అఖిల్ కు దాని డిజాస్టర్ ఫలితం మాములు షాక్ ఇవ్వలేదు. ఏదో యావరేజ్ గా ఆడినా ఫ్యాన్స్ సర్దిచెప్పుకునే వాళ్ళు కానీ సినిమా మరీ ఘోరంగా దెబ్బ తినడం సోషల్ మీడియాలో భారీ డిబేట్ కు దారి తీసింది. ప్రమోషన్లకు కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరిగిన అఖిల్ కు దక్కాల్సిన ఫలితమైతే ఇది కాదు. ఈ మూవీతో కమర్షియల్ హీరోగా సెటిలవుతాడనే ఆశలకు బ్రేక్ పడింది

3. సమంతా

Also Read – పిఠాపురం MLA గారి తాలూకా ఎలివేషన్స్..!

శాకుంతలం మీద గంపెడాశలతో ఉన్న సమంతాకు అచ్చం ఏజెంట్ లాగే రిజల్ట్ దక్కడం హాట్ టాపిక్. భారీ బడ్జెట్, త్రీ డి టెక్నాలజీ, విజువల్ ఎఫెక్ట్స్ ఇవేవీ కాపాడలేకపోయాయి. సామ్ ని ప్రత్యేకంగా టార్గెట్ చేసే కొన్ని వర్గాలు శాకుంతలం ఫలితాన్ని వాడుకోవడం గమనించవచ్చు. రిజల్ట్ స్పష్టంగా తెలిసిపోవడంతో వారం తిరక్కుండానే సిటాడెల్ ప్రీమియర్ కోసం సమంత విదేశాలకు వెళ్లిపోయింది

4. అల్లు అర్జున్

అభిమానులు కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూసిన పుష్ప 2 ది రూల్ టీజర్ వల్ల అల్లు అర్జున్ హెడ్ లైన్స్ లోకి వచ్చేశాడు. ముఖ్యంగా గంగమ్మ జాతర వేషధారణలో ఇచ్చిన షాకింగ్ లుక్ భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ట్విట్టర్లో జూనియర్ ఎన్టీఆర్ తనూ పరస్పరం బావా బావా అంటూ సరదాగా సంబోధించుకోవడం ఫ్యాన్స్ ఎంజాయ్ చేశారు.

5. విరూపాక్ష

రిపబ్లిక్ డే ఫలితం, బైక్ యాక్సిడెంట్ వల్ల సుదీర్ఘ విరామంతో అందుబాటులో లేకుండా పోయిన సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష రూపంలో సాలిడ్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఒక కమర్షియల్ హీరోతో మాస్ ఫార్ములాకు దూరంగా హారర్ ఎలిమెంట్స్ మెప్పించవచ్చని స్క్రీన్ ప్లే అందించిన సుకుమార్, దర్శకుడు కార్తీక్ దండు ఋజువు చేశారు. మూడో వారంలోనూ కలెక్షన్లు స్టడీగా ఉండటం రేంజ్ ఏంటో చెబుతుంది

6. జూనియర్ ఎన్టీఆర్

కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యాక తారక్ వివిధ వార్తల్లో హైలైట్ అవుతున్నాడు. అమెజాన్ ప్రైమ్ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ కి తన ఇంట్లో గ్రాండ్ పార్టీ ఇవ్వడంతో ఆ ఫోటోలు ట్విట్టర్, ఇన్స్ టాలో బాగా వైరల్ అయ్యాయి. గార్డియన్స్ అఫ్ గాలక్సీ దర్శకుడు జేమ్స్ గన్ జూనియర్ ఎన్టీఆర్ ని తన యూనివర్స్ లో భాగం చేసుకోవాలని ఉందని చెప్పిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొట్టింది

7. సురేందర్ రెడ్డి

ఒకప్పుడు రేసు గుర్రం లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు ఏజెంట్ లాంటి బ్యాడ్ అవుట్ ఫుట్ ఇస్తాడని ఎవరూ ఊహించలేదు. కనీస బాధ్యత లేకుండా స్క్రిప్ట్ విషయంలో తీవ్ర నిర్లక్ష్యం వహించారని అక్కినేని అభిమానులు ఓపెన్ గానే ఫైర్ అయ్యారు. దానికి తోడు అనిల్ సుంకర వేసిన ట్వీట్ వాళ్ళ భయాన్ని నిర్ధారించింది. అన్నీ వేళ్ళు తనవైపే వచ్చేలా చేసుకోవడంతో సురేందర్ రెడ్డిదే తప్పు

8. గుణశేఖర్

కోట్ల రూపాయల బడ్జెట్ ని మంచి నీళ్లలా ఖర్చు పెట్టినప్పుడు ఎంచుకున్న కథల పట్ల జాగ్రత్త అవసరం. కానీ దర్శకుడు గుణశేఖర్ హంగుల మీద పెట్టిన దృష్టి శకుంతల గాథ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వదనే వాస్తవం మీద పెట్టి ఉంటే ఇంత దారుణమైన డిజాస్టర్ వచ్చేది కాదు. బలమైన కంబ్యాక్ ఇస్తుందని ఆయన పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరైపోయాయి. క్యాస్టింగ్ నుంచి మేకింగ్ దాకా అన్నీ విమర్శలకు గురయ్యాయి

9. మైత్రి మూవీ మేకర్స్

టాలీవుడ్ లోనే అతి పెద్ద ప్రొడక్షన్ హౌస్ గా పేరు గాంచిన మైత్రి మూవీ మేకర్స్ ఆఫీసుల మీద ఆదాయపు పన్ను శాఖా అధికారులు
దాడి చేయడం పరిశ్రమలో కలకలం రేపింది. పుష్ప 2, ఖుషి లాంటి క్రేజీ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్న సమయంలో ఇలా జరగడం పట్ల తొలుత ఆందోళన వ్యక్తమైనప్పటికీ తర్వాత కథ సుఖాంతమైపోయింది. బ్యానర్ కు షాక్ ఇచ్చిన మీటర్ వచ్చింది కూడా ఈ నెలలోనే

10. రవితేజ

ధమాకా, వాల్తేరు వీరయ్య రెండు వరస బ్లాక్ బస్టర్లతో ఊపుమీదున్న మాస్ మహారాజా రవితేజకు రావణాసుర పెద్ద ఝలక్ ఇచ్చింది. నెగటివ్ షేడ్స్ తో ఏదో ప్రయోగం చేద్దామని దర్శకుడు సుధీర్ వర్మతో చేసిన ప్రయత్నం వికటించింది. అందులోనూ నిర్మాతగా భాగస్వామ్యం తీసుకోవడంతో నష్టం తాలూకు ప్రభావం రవితేజ మీద కూడా బలంగా పడింది. సగం రికవరీ కూడా జరగలేదు.