Top 10 Most Popular Stars February 2023నూతన సంవత్సర కానుకగా గత నెల మిర్చి 9 ప్రారంభించిన ప్రతి నెలా పాపులర్ స్టార్స్ ప్రత్యేక కథనానికి ఇటు చదువరుల నుంచి పరిశ్రమ నుంచి అద్భుత స్పందన దక్కింది. కేవలం హీరోలు హీరోయిన్ల గురించే కాకుండా ఇండస్ట్రీకి సంబంధించి ఎవరైతే విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్నారో వాటికి కారణాలను విశ్లేషిస్తూ నిష్పక్షపాతంగా సాగే ఈ స్పెషల్ ఫీచర్ ఏడాది పొడవునా పన్నెండు నెలలు కొనసాగుతూనే ఉంటుంది. ఫిబ్రవరిలో అలా వార్తల్లో నిలిచి తొలి పది స్థానాలను తీసుకున్నవారెవరో చూద్దాం.

1. రామ్ చరణ్

Also Read – బ్లూ మీడియా ఆర్తనాదాలు..! జగన్ వింటున్నారా..?

ఆర్ఆర్ఆర్ కోసం యుఎస్ వెళ్లిన రామ్ చరణ్ ఈ నెల సోషల్ మీడియా సెన్సేషన్ గా నిలిచారు. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ప్రకటించిన అవార్డుల స్వీకారంతో పాటు ఓ విభాగానికి పురస్కారం అందజేసే అతిథిగా ఆహ్వానం రావడంతో వాటి తాలూకు ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. అంతకన్నా ముందు గుడ్ మార్నింగ్ అమెరికా ప్రోగ్రాంకు స్పెషల్ గెస్ట్ గా వెళ్లడం ఆ వీడియోలు ఫ్యాన్స్ మధ్య బాగా తిరిగాయి. గ్లోబల్ స్టార్ ట్యాగ్ కోసం కొందరు అభిమానులు చేసిన అతి ఆన్లైన్ రచ్చకు కారణమయ్యింది

2. బాలకృష్ణ

Also Read – జైలు జీవిత పుష్కరాలు… మళ్ళీ గుర్తుకొస్తున్నాయా..?

సినిమా పరంగా కాకుండా బాలకృష్ణ ఈసారి మరో విషయంలో జనాల మనసులు గెలుచుకున్నారు. తారకరత్న బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సమయంలో బాబాయ్ అంటూ ప్రేమగా పిలిచే అతని కోసం తండ్రి కన్నా ఎక్కువగా తల్లడిల్లి[పోయిన తీరు చూసిన వాళ్ళను కదిలించింది. తారకరత్న కన్నుమూశాక కడచూపు కోసం వచ్చినవాళ్ళను పలకరించడంతో మొదలుపెట్టి అంత్యక్రియల క్రతువులో పాడె మోసి కట్టె కాలేంత వరకు అక్కడే ఉండటం ఇష్టపడని వాళ్ళను సైతం జైబాలయ్య అనిపించింది

3. చిరంజీవి

Also Read – టిడిపి మౌనం కూడా వైసీపికి ఆందోళన కలిగిస్తోందా?

పుత్రోత్సాహంతో ఉబ్బితబ్బిబవుతున్న చిరంజీవి రామ్ చరణ్ ని పొగిడే క్రమంలో చేసిన ట్వీట్లు టార్గెట్ అయ్యేందుకు కారణం అయ్యాయి. అవతార్ దర్శకుడు జేమ్స్ క్యామరూన్ ఆర్ఆర్ఆర్ యూనిట్ ని, రామరాజు పాత్రను తీర్చిదిద్దిన రాజమౌళి పనితనాన్ని పొగిడితే దాన్ని పొరపాటుగా అర్థం చేసుకుని రామ్ చరణ్ కే కాంప్లిమెంట్స్ ఇచ్చారనుకుని జక్కన్న, జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన లేకుండా పొగడ్తలు గుప్పించడం తనను విమర్శించేందుకు అవకాశం ఇచ్చినట్టు అయ్యింది

4. నాని

సంక్రాంతి తర్వాత మళ్ళీ మాకు కావాల్సిన సినిమా ఎప్పుడొస్తుందని ఎదురు చూసిన మాస్ కోసం నాని చేసిన దసరా కేవలం ఫ్యాన్స్ మధ్యే కాదు బిజినెస్ సర్కిల్స్ లోనూ హాట్ టాపిక్ గా మారింది. దానికి తోడు ప్యాన్ ఇండియా రేంజ్ లో ప్రమోషన్లు చేయాలని ప్రొడక్షన్ టీమ్ నిర్ణయించుకోవడంతో కేవలం చిన్న టీజర్ తోనే అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయాయి. మార్చి 30కి ఇంకా టైం ఉన్నప్పటికీ మూవీ లవర్స్ దృష్టిలో తన మ్యానరిజం ద్వారా దగ్గరైన నాని దసరా హైప్ ని ఎక్కడికో తీసుకెళ్లిన మాట వాస్తవం

5. జూనియర్ ఎన్టీఆర్

అనూహ్య కారణాల వల్ల తారక్ ఈసారి వార్తల్లో నిలిచాడు. ఎన్టీఆర్ 30 ఎదురు చూసే కొద్దీ విపరీతమైన ఆలస్యానికి గురవ్వడంతో అభిమానుల అసహనం పీక్స్ కు చేరుకుంది. దానికి తగ్గట్టే అమిగోస్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో అప్ డేట్ అడిగిన యాంకర్ సుమని కాసింత కోపంతో కూడిన ఎక్స్ ప్రెషన్ ఇచ్చిన తారక్ క్లోజ్ అప్ షాట్ ట్విట్టర్, ఇన్స్ టాలో ఓ రేంజ్ లో రీచ్ అయ్యింది. ఇక ఆర్ఆర్ఆర్ క్రెడిట్ కోసం ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ట్విట్టర్ లో కొట్టుకుంటున్న వైనం మరోసారి రామరాజుతో పాటు కొమరం భీముడిని హైలైట్ చేసింది

6. నాగ వంశీ

మాటల్లో కాన్ఫిడెన్స్ అవతలి వాళ్లకు మరోలా రీచ్ అయ్యేలా మాట్లాడ్డం నిర్మాత నాగ వంశీ ప్రత్యేకత. మహేష్ బాబు త్రివిక్రమ్ ల సినిమా ఫ్యామిలీ ఎంటర్ టైనరని చెబుతూనే రాజమౌళి రికార్డులకు దగ్గరగా వెళ్లిపోతామని చెప్పడం ఒకరకంగా యాంటీ ఫ్యాన్స్ కి ట్రిగ్గర్ పాయింట్ గా మారింది. ప్రొడక్షన్ పరంగా బుట్టబొమ్మ డిజాస్టర్ ఇవ్వగా సార్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది. అవతార్ 2, కాంతారలు తనకు మరీ గొప్పగా అనిపించలేదని చెప్పడం కూడా నాగవంశీకి మాత్రమే సొంతమైన శైలి

7. అల్లు అరవింద్

అసలేమీ చేయకుండా కేవలం ఒక ప్రెస్ నోట్ తో అల్లు అరవింద్ వార్తల్లో నిలిచారు. విజయ్ దేవరకొండ దర్శకుడు పరశురామ్ కాంబినేషన్ లో నిర్మాత దిల్ రాజు ప్రాజెక్ట్ అనౌన్స్ చేయగానే వెంటనే అప్పటికప్పుడు అరవింద్ మీడియాకు మాట్లాడాలని ఆహ్వానం పంపించారు. మాములుగా ఎంతో సౌమ్యంగా ఉండే ఆయన ఏదో కుండ బద్దలు కొట్టి సంచలనం రేపుతారని అందరూ ఎదురు చూశారు. కానీ వ్యవహారం లోలోపల సద్దుమణగడంతో సమావేశాన్ని రద్దు చేసి వేడిని చల్లార్చారు

8. అనురాగ్ శరత్

మంచి సినిమాను తీయడం కాదు దాన్ని ఎలా ప్రమోట్ చేసుకోవాలో ఒక పద్ధతి ప్రకారం చూపించిన నిర్మాతలు అనురాగ్ & శరత్. మేజర్ లాంటి ప్యాన్ ఇండియా సక్సెస్ అందుకున్నాక ఈ నెల రైటర్ పద్మభూషణ్ తో వచ్చారు. ఏ అంచనాలు లేకుండా సుహాస్ హీరోగా ఈ సినిమా పది కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిందంటే దానికి కారణం కేవలం కంటెంట్ కాదు. జనానికి చేరువ చేయడం కోసం ఫ్రీ షోలు వేయడం, ముందు రోజు ప్రీమియర్లు, మహిళలకు ఉచిత టికెట్లు ఇవన్నీ మార్కెటింగ్ నైపుణ్యానికి నిదర్శనాలు

9. స్మిత

బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో అయిపోయాక మళ్ళీ సెలబ్రిటీ ప్రోగ్రాం ఏది వస్తుందా అని ఎదురు చూస్తున్న తరుణంలో సోనీ లివ్ ద్వారా సింగర్ స్మిత ఈ బాధ్యతను తీసుకోవడం ఆడియన్స్ దృష్టిని ఆకర్షించింది. ఏదో ఆషామాషీగా కాకుండా చిరంజీవి, చంద్రబాబునాయుడు, నాని, రానా లాంటి ప్రముఖులను తీసుకురావడం షాక్ ఇచ్చింది. అయితే ఈ సందర్భంగా స్మిత వెలిబుచ్చిన వ్యక్తిగత అభిప్రాయాలకు కొందరు కుల రాజకీయ రంగు పులమడం విచారకరం

10. అనుష్క

కొత్త సినిమా రిలీజై ఏళ్ళు గడుస్తున్నా అనుష్క మాత్రం ఒక్క ఫోటోతో మళ్ళీ హాట్ టాపిక్ గా మారిపోయింది. ఏదో పెళ్లి వేడుకలో స్వీటీ పిక్ ఒకటి లీకవ్వడంతో దాని గురించి నెటిజెన్ల మధ్య చర్చ జరిగింది. నవీన్ పోలిశెట్టితో చేస్తున్న చిత్రం ముగింపు దశకు వస్తున్న తరుణంలో ఎలాగూ దాని ఈవెంట్లు వస్తుంది కనక అప్పుడు లైవ్ లోనే చూసేయొచ్చు