దివంగత నేత పరిటాల రవి ప్రధాన అనుచరుడు చమన్ సాబ్ హఠాన్మరణం చెందడంతో మంత్రి పరిటాల సునీత ఆసుపత్రిలోనే కళ్లుతిరిగి స్పృహతప్పి పడిపోయారు. పరిటాల రవి కుమార్తె స్నేహలత వివాహ వేడుక ఏర్పాట్లలో ఉత్సాహంగా పాల్గొన్న చమన్‌కు సోమవారం ఉదయం గుండెపోటు రావడంతో వెంటనే అనంతపురంలోని సవేరా ఆసుపత్రికి తరలించారు.
కుమారుడు శ్రీరామ్‌తో కలిసి ఆసుపత్రికి చేరుకున్న మంత్రి సునీత చమన్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి వెళ్ళగా వైద్యులు చికిత్స అందిస్తుండగానే చమన్ ఆకస్మికంగా మృతి చెందారు. చమన్ మృతి చెందారనే విషయం తెలియగానే అక్కడే ఉన్న సునీత ఒక్కసారిగా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
కుమారుడు శ్రీరామ్ ఓదారుస్తుండగానే సునీత స్పృహతప్పి పడిపోయారు. వెంటనే శ్రీరామ్‌తో పాటు అక్కడున్నవాళ్లు పైకి లేపి ఆసుపత్రి బెడ్‌పై పడుకోబెట్టారు. అక్కడే వైద్యులు ప్రధమ చికిత్స అందిస్తున్నారు. పరిటాల మృతి తరువాత 8 ఏళ్ళు అజ్ఞాతంలో ఉన్న చమన్ 2014 ఎన్నికల ముందు తిరిగి అనంతపూర్ వచ్చారు.