Minister Narayan Chandrababu naidu Houseజాతీయ హరిత గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు అనుకూలంగా రావడంతో అమరావతి పనులు ఊపందుకోనున్నాయి. ట్రిబ్యునల్ తీర్పును అనుసరించి పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా లేకపోతే, అవసరమైతే కృష్ణానది కరకట్ట లోపల ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసాన్ని అయినా తొలగిస్తామని మున్సిపల్ మంత్రి నారాయణ చెప్పారని కధనం.

కరకట్ట లోపల నది నుంచి వంద మీటర్ల వరకు ఎటువంటి నిర్మాణాలు ఉండకూడదని, సీఎం నివాసం వంద మీటర్ల లోపుంటే తొలగిస్తామని చెప్పారు. నది నుంచి వంద మీటర్ల లోపు ఉన్న నిర్మాణాలన్నింటినీ తొలగించాల్సిందేనన్నారు. ఏ నిర్మాణాలు ఈ పరిధిలో ఉన్నాయో చూస్తామని, సీఎం నివాసం కూడా ఈ పరిధిలోపు ఉందో లేదో చూసి ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

చంద్రబాబు ప్రస్తుతం ఉంటున్న ఉండవల్లి నివాసం నిబంధనలు అతిక్రమించి కట్టిందే. అయితే ఈ బిల్డింగ్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ కింద తీసేసుకుంది. ప్రస్తుతం ప్రభుత్వ అవసరాలకు వాడుకుని అమరావతి నిర్మాణ సమయంలో అవసరం అయితే కూల్చి వెయ్యాలని ప్రభుత్వ వ్యూహం.