Minister-Audimulapu-Sureshఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తమ పార్టీ కోసమే పనిచేసేందుకు లక్షల మందితో వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటుచేసుకొంది. వారిని పర్యవేక్షించేందుకు సచివాలయ వ్యవస్థని కూడా ఏర్పాటుచేసుకొంది. అయితే ఈ రెండు వ్యవస్థలతో త్రిశంకు స్వర్గం సృష్టించి దానిలో వారిని బందించిందని చెప్పవచ్చు. ఏవిదంగా అంటే ఈ రెండు వ్యవస్థలలో పనిచేస్తున్నవారిని వైసీపీ నేతలే నియమిత్రిస్తున్నారు. వైసీపీకి అనుకూలంగా పనిచేయాలని హెచ్చరిస్తున్నారు.

జనవరి 4న కోనసీమ జిల్లా అల్లవరంలో మంత్రి పినిపె విశ్వరూప్ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లతో సమావేశమైనప్పుడు మాట్లాడుతూ “ఒకవేళ రాష్ట్రంలో వైసీపీ మళ్ళీ అధికారంలోకి రాలేకపోతే మీ అందరి ఉద్యోగాలు ఊడిపోతాయని, అదే… మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే మీ అందరికీ నెలకి రూ.15,000 జీతాలు ఇస్తామని చెప్పారు.

ఇది గమనిస్తే ఈ రెండు వ్యవస్థలు, వాటిలో పనిచేసే లక్షలాది ఉద్యోగుల పరిస్థితి అర్దం అవుతుంది. మంత్రి విశ్వరూప్ చెప్పిన్నట్లుగా ఒకవేళ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వస్తే వైసీపీ కార్యకర్తలతో కూడిన ఈ రెండు వ్యవస్థలు టిడిపికి అవసరం లేదు కనుక తక్షణం వాటిని రద్దు చేయడం ఖాయం. అంటే అందరి ఉద్యోగాలు ఊడిపోవడం ఖాయం. కనుక సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు అందరూ కూడా ఎట్టి పరిస్థితులలో మళ్ళీ వైసీపీని అధికారంలోకి తెచ్చుకోవడానికి పార్టీ నేతల కనుసన్నలలో పనిచేయాల్సి ఉంటుంది. అంటే వైసీపీ ప్రభుత్వం సృష్టించిన త్రిశంకు స్వర్గంలో అందరూ బందీలుగామారిపోయారన్న మాట! అయితే వారందరికీ వేరే గత్యంతరం లేదు కనుక ఈ త్రిశంకు స్వర్గమే నిజమైన స్వర్గమని భావిస్తూ ఈ ఒత్తిళ్ళు భరించాల్సిందే.