Minister anil kumar yadav comments on chandrababu naidu residencyకరకట్ట మీద చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటి మీదే వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుల దృష్టి అంతా ఉంటుంది. ఎప్పుడు వరదల్లో ఆ ఇల్లు మునిగిపోతుందా… లేక ఎప్పుడు చంద్రబాబు ఖాళీ చేస్తే భయపడిపారిపోయారు అని చెప్పుకుందామా అనే ఆసక్తి వారిలో ఎక్కువగా కనపడుతుంది. తాజాగా నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు చిత్రంగా ఉన్నాయి.

కృష్ణానది కరకట్టపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇప్పటికీ నివసించడంపై అనిల్ కుమార్ యాదవ్ ఆక్షేపించారు. వరదలు వచ్చి కరకట్ట మీద ఇల్లు మునుగుతుంటే.. ఖాళీ చేయకుండా చంద్రబాబు అక్కడే ఉంటాననడం సిగ్గుచేటని ఆయన అన్నారు. కరకట్ట మీద ఉన్న ఇల్లు చంద్రబాబు ప్రైవేటు హక్కు.

వరద వచ్చే అవకాశం ఉంటే నోటీసు ఇచ్చారు సరే ఖాళీ చెయ్యడం చెయ్యకపోవడం ఆయన ఇష్టం. సామాన్యులను అయితే బలవంతంగా ఖాళీ చేయిస్తారు… ప్రతిపక్ష నేత చంద్రబాబు ఖాళీ చెయ్యడం వల్ల కలిగే పర్యవసానాలు తెలియకుండా ఉండవు. ఖాళీ చెయ్యడం చెయ్యకపోవడం వారి ఇష్టం… ఇందులో ప్రభుత్వానికి వచ్చిన బాధ ఏంటి?

ఖాళీ చేయకుండా చంద్రబాబు అక్కడే ఉంటాననడం సిగ్గుచేటు అనడం ఏంటో? బహుశా తమ ఎజెండాను చంద్రబాబు జరగనివ్వడం లేదని మంత్రిగారి ఆక్రోశం కావొచ్చు అని టీడీపీ వారు అంటున్నారు. ఇకనైనా చంద్రబాబు సంగతి వదిలేసి జలమయం అయ్యి ప్రభుత్వ సాయం అందకుండా ఇబ్బందుల పడుతున్న గ్రామాల పై ప్రభుత్వం దృష్టిపెడితే మంచిది.