minister-anil-kumar-yadav-challenges-tdp-on-polavaram-projectపోలవరం ప్రాజెక్టుపై నీటి పారుదల శాఖా మంత్రికే సరైన అవగాహన లేదా అంటూ పలువురు విమర్శిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు రూ.48 వేల కోట్ల అంచనాలతో నిర్మాణం కావాల్సి ఉండగా తెలుగుదేశం పార్టీ హయాంలో రూ.16,800 కోట్లు ఖర్చు చేశారు. 35 శాతం నిధులు ఖర్చు పెట్టి 70 శాతం పనులు పూర్తిచేసినట్లు మాజీ మంత్రి దేవినేని ఉమా చెబుతున్నారు, అలా ఎలా సాధ్యం అని జలవనరులశాఖ మంత్రి అనిల్ కుమార్ ప్రశ్నించారు.

48,000 కోట్ల అంచనాలో అందులో కేవలం ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే ఖర్చు 16,010.45 కోట్లు… మిగతాదంతా పునరావాసానికి. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం ఆ ఖర్చు భారీగా ఉంటుంది. అయితే ప్రాజెక్టు సైట్ వద్ద కొన్ని భూములే ఇప్పటివరకు సేకరించారు. ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చే నాటికి పూర్తి స్థాయితో సేకరణ చెప్పటాలి.

తెలుగుదేశం చెప్పే 70% పూర్తి అనేది కేవలం ప్రాజెక్టు నిర్మాణమే. తెలుగుదేశం ప్రభుత్వమైనా, ఇటు జగన్ ప్రభుత్వానికైనా ఆ ఖర్చు చివరలో వచ్చేదే. ఆ విషయాన్నీ జలవనరులు శాఖా మంత్రి ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టడమో లేక నిజంగా ఆయనకు తెలియకపోవడం జరిగిందని టీడీపీ వారి ఆరోపణ.

ఇది ఇలా ఉండగా…. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుండీ ముందుకు సాగడం లేదు. రీ-టెండరింగ్ అంటూ హడావిడిగా కాంట్రాక్టర్ ని మార్చారు. అయితే క్షేత్ర స్థాయిలో పనులు అసలు జరగడమే లేదు. జగన్ ను బాగా సమర్ధించే ఉండవల్లి వంటి వారు కూడా అక్కడ ఒక్క తట్ట మట్టి పోసింది లేదు అని అంటున్నారు.