Mind blowing VFX in 2.0 Movieప్రపంచ వ్యాప్తంగా అటు సోషియల్ మీడియాలో…ఇటు థియేటర్స్ లో తన ఊపుతో హల్‌చల్ చేస్తున్న ఇండియన్ మోస్ట్ అవేటెడ్ మూవీ తలైవార్ ‘రోబో-2.0’ ఈరోజు ఫాన్స్ కే కాదు, సినిమా ప్రేక్షక దేవుళ్ళకు సంబరాలను తెచ్చిపెట్టింది. అయితే ఈ సినిమా థ్రీ-డీలోనే చూడాలి అన్నది చాలా మంది సూచనగా తెలుస్తుంది. అప్పుడే ఆ విషువల్ ఎఫెక్ట్స్ లో కిక్ ను బాగా ఎంజాయ్ చెయ్యవచ్చు అని అంటున్నారు. ఇక దాదాపుగా 550 కోట్ల భారీ బడ్జెట్ సినిమా అన్న మాట కాసేపు పక్కన పెట్టేసి, అసలు ఈ సినిమా ఎందుకు మిస్ అవకూడదు అని చిన్న లెక్కలోకి వెళ్ళి చూస్తే.

మొదటిగా “విషువల్ ఎఫెక్ట్స్”…హాలీవుడ్ రేంజ్ ని ఇటు కోలీవుడ్ నుంచి టాలీవుడ్ మీదగా బాలీవుడ్ వరకూ చూపించాడు దర్శకుడు శంకర్. ఆ విషువల్ ఫీస్ట్ కోసం అయినా ఈ సినిమాను మిస్ అవకండి. కొన్ని కొని చోట్ల అయితే విషువల్ ఎఫెక్ట్స్ కుమ్మి వదిలేపెట్టాడు అంతే. ఇవి కాకుండా అక్షయ్ కుమార్ పాత్ర కోసం, అక్షయ్ కుమార్ యాక్షన్ కోసం…అక్షయ్ కుమార్ మేక్ అప్ కోసం ఈ సినిమా తప్పకుండా చూడాల్సిందే. అక్షయ్ కుమార్ తన గతాన్ని వివరించే టైమ్ లో ఆయన మేక్ అప్ కానీ, పక్షిగా మారిన అక్షయ్ ను స్క్రీన్ పై ప్రెసెంట్ చేసిన విధానం కానీ, తెరపై థ్రీ-డీలో చూస్తూ ఉంటే, మనకున్న కళ్ళు సరిపోక ఆమూడు గంటలు పక్క వారు కళ్ళు అప్పుగా ఇస్తే బావుందేమో అన్న ఫీలింగ్ వస్తుంది అంటే నమ్మండి.

ఇక రజని-రెహ్మాన్-శంకర్ హ్యాట్రిక్ కాంబో కోసం మరోసారి ఈ సినిమాని చూడాల్సిందే. ఇక ఒక స్థాయి లెవెల్ లో ఉన్న టెక్చ్‌నియన్స్ అందరూ ఈ సినిమా కోసం పనిచేశారు. వారి ప్రతిభను మరోమారు తెరపై తిలకించడానికి అయినా ఈ సినిమాను ఒక్కసారి చూడాల్సిందే. ఇక వీటన్నింటికంటే శంకర్ ఆలోచన కోసం, భవిష్యత్తుపై ఆయన ఊహాను తెరపై మన కళ్ళతో చూడాలి అంటే ఈ సినిమాను తప్పకుండా ఒక లుక్ వెయ్యాల్సిందే. మొత్తంగా ఈ సినిమా అటు అభిమానుల నుంచి, ఇటు సినిమా లవర్స్ వరకూ అందరినీ మెప్పించి పండగ చేసుకునేలా చేస్తుంది అని చెప్ప వచ్చు.