'Middle-Class-Melodies'---Deverakonda-Turning-Garrulous-Guy‘Middle-Class-Melodies’—Deverakonda-Turning-Garrulous-Guyవిజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రం దొరసానితో తొలిసారిగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. ఇప్పుడు, అతని రెండవ సినిమా కూడా ప్రకటించబడింది. ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ పేరుతో ఉన్న ఈ మూవీకి వినోద్ అనంతోజు అనే కొత్త అతను దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ సినిమాలో ఆనంద్ ఒక టిఫిన్ సెంటర్ పెట్టాలనుకునే యువకుడిగా కనిపిస్తాడు. బొంబాయి చట్నీ చెయ్యడంలో అతనికి అతనే సాటి. ఈ పాత్ర కోసం ఆనంద్ తన ఇంటి లివింగ్ ఏరియాని వంటిల్లుగా మార్చేశాడంట. దోశలు వెయ్యడం, చట్నీలు చెయ్యడం ప్రాక్టీస్ చేశాడట. అలాగే తెలంగాణ నుండి వచ్చిన ఆనంద్ గుంటూరు యాసలో మాట్లాడటం కూడా నేర్చుకున్నాడట.

ఈ చిత్రంలో ఆనంద్ సరసన వర్షా బొల్లమ్మ హీరోయిన్ గా కనిపించనుంది. ఈ ఏడాది విడుదలైన చూసి చూడంగానే అనే సినిమాతో ఆమె తెలుగులో అరంగేట్రం చేసింది. కేర్ ఆఫ్ కంచరపాలెం కోసం సంగీతం స్కోర్ చేసిన స్వీకర్ అగస్తి ఈ చిత్రానికి సంగీత కంపోజర్. వెనిగల్ల ఆనంద్ ప్రసాద్ తన భవ క్రియేషన్స్ బ్యానర్‌లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఆనంద్ ప్రసాద్ ఎక్కువగా గోపీచంద్ తో సినిమాలు చేసే వారు. ఆయన చివరిగా బాలయ్య, పూరి జగన్నాధ్ తో పైసా వసూల్ సినిమాని నిర్మించారు. మిడిల్ క్లాస్ మెలోడీస్ ఫస్ట్ కాపీ ఇప్పటికే రెడీ అయ్యింది. థియేటర్లు ఓపెన్ కాగానే సినిమాను విడుదల చేస్తారు. మరి ఈ రెండో చిత్రంతో ఆనంద్ హిట్ కొట్టగలడో లేదో చూడాలి.