Micheal Corsale, Shruti Haasan'‘గబ్బర్ సింగ్’తో ఫేట్ మార్చుకుని ‘శ్రీమంతుడు’ సక్సెస్ తో టాప్ చైర్ లో కూర్చున్న శృతిహాసన్ ఒక్క తెలుగుకు మాత్రమే పరిమితం కాలేదు. కోలీవుడ్, బాలీవుడ్ లలోనూ సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్ గా మారిన ఈ ముద్దుగుమ్మ వ్యవహారం, ఇటీవల కాలంలో హాట్ టాపిక్ గా మారింది. తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి శృతిహాసన్ సందడి చేస్తోన్న ఫోటోల ప్రభావమే ఈ హంగామాకు కారణం.

బ్రిటిష్‌ కు చెందిన ఇంగ్లీష్ థియేటర్ ఆర్టిస్టు మైఖేల్ కోర్సెల్ తో తన ప్రేమ వ్యవహారాన్ని అందాల భామ శ్రుతి హాసన్ ఎంతగా దాచాలని చూస్తున్నా, ఏదో ఓ రకంగా బయటకు వస్తూనే ఉంది. ఇటీవలే ఎయిర్ పోర్ట్ లో వీరిద్దరూ సందడి చేసిన ఫోటో ఒకటి సోషల్ అండ్ వెబ్ మీడియాలో ప్రత్యక్షమై హంగామా చేయగా, తాజాగా మైఖేల్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసిన మరొక ఫోటో హల్చల్ చేస్తోంది.

ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా, శృతి కోసమే ప్రత్యేకించి ఇండియాకు వచ్చిన మైఖేల్, ముంబైలో ఆమెతో కాసేపు టైం సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. ‘ఇండియాలో ఓ మంచి అమ్మాయితో చక్కటి సమయాన్ని గడిపాను. అందమైన స్నేహితుల బృందం ఇక్కడుంది. ఇండియా నాకు రెండో ఇల్లు’ అంటూ శృతితో దిగిన ఓ సెల్ఫీ ఫోటోను పోస్ట్ చేసారు మైఖేల్. ప్రస్తుతం వీరిద్దరూ డేటింగ్‌ లో ఉన్నట్టు బాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న వార్తలు.