Michael Vaughanఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా జరిగిన మొదటి టీ20 మ్యాచ్ లో టీమిండియా ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. బౌలింగ్ లో కులదీప్, బ్యాటింగ్ లో రాహుల్ లు అదరగొట్టడంతో ఇంగ్లాండ్ జట్టు ఘోర పరాభవాన్ని చవిచూడాల్సి వచ్చింది. టీమిండియాపై ఏ రంగంలోనూ ఇంగ్లాండ్ మెరుగైన ప్రదర్శనను ఇవ్వలేకపోయింది. అయితే దీనిని ఒప్పుకునే స్థితిలో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ఉన్నట్లుగా కనపడడం లేదు.

ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ కుప్పకూలుతున్న సమయంలో ట్విట్టర్ లో… “ఇంగ్లాండ్ పతనానికి కులదీప్ యాదవ్ కారణమవుతున్నాడు, ఆసీస్ కంటే ఇండియా కాస్త మెరుగైనది” అంటూ ట్వీట్ చేసారు. దీనికి ప్రతిగా నెటిజన్లు మైకేల్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఆసీస్ కంటే ఇండియా మెరుగైన జట్టే, కానీ ఇంగ్లాండ్ జట్టు స్కాట్లాండ్ కంటే వరస్ట్ జట్టు అంటూ ఇటీవల స్కాట్లాండ్ చేతిలో పరాభవానికి గురైన స్క్రీన్ షాట్లను తీసి వాన్ కు రిప్లై ఇస్తున్నారు.

అలాగే ఇటీవల టీమిండియా చేతిలో ఓడిన ఐర్లాండ్ కంటే ఇంగ్లాండ్ కాస్త మెరుగైన జట్టని…. మీరు చేసిన ట్వీట్ కు, మీ టీం ఆడుతోన్న విధానానికి ఎక్కడైనా సంబంధం ఉందా?… అలాగే ఐసీసీ టీ 20 ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా క్రింద ఇంగ్లాండ్ ఉండడం, ఆసీస్ పైన ఇండియా ఉండడం ఉన్న లేటెస్ట్ స్క్రీన్ షాట్లను పోస్ట్ చేస్తూ… మైఖేల్ కు దిమ్మతిరిగేలా చేస్తున్నారు. ఆటలో గెలుపోటములు సహజం గానీ, ప్రత్యర్ధి జట్టును తక్కువ చేసి మాట్లాడితే మూల్యం ఏ విధంగా ఉంటుందో అన్ని రకాలుగా వాన్ కు తెలిసివచ్చినట్లయ్యింది.