metoo-ar-rahman-sister-rehana-responds-on-vairamuthu-allegationతమిళ గీత రచయిత వైరముత్తు అమ్మాయిలను లైంగికంగా వేధించేవాడని ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సోదరి రెహానా తెలిపారు. అతని వ్యవహారాలపై చాలా విషయాలు తాను చాలా విన్నానని, యువ గాయనీమణులను ట్రాప్ చేసేందుకు తన సోదరుడు ఏఆర్ రెహమాన్ పేరును సైతం వాడుకున్నాడని ఆరోపించాడు. ఈ విషయాలేవీ తన సోదరుడికి తెలియదని వ్యాఖ్యానించారు.

ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె వైరముత్తు వ్యవహారంపై మాట్లాడారు. వైరముత్తు వేధింపులపై గాయని చిన్మయి శ్రీపాద చేసిన ఆరోపణలను తాను నమ్ముతున్నట్లు రెహానా అన్నారు. ఈ విషయం బయటకు రాగానే ‘ఇది నిజమేనా?’ అని అడిగాడనీ, దీంతో వైరముత్తుపై వచ్చిన ఆరోపణల గురించి రెహమాన్ కు చెప్పినట్లు ఆమె తెలిపారు. మీటూ ఉద్యమానికి తాము మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.