mental-madhilo-trailer-talkటాలీవుడ్ లో ‘పెళ్లిచూపులు’ సినిమా సాధించిన సక్సెస్ తెలిసిందే. ఈ సినిమా ద్వారా హీరోగా వెలుగులోకి వచ్చిన విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ ద్వారా ఇప్పటికే ఓ సక్సెస్ అందుకోగా, తాజాగా ‘పెళ్లిచూపులు’ సినిమాను నిర్మించిన సంస్థ నుండి “మెంటల్ మదిలో” అనే మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శ్రీ విష్ణు, నివేతా పేతురాజ్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ విడుదల చేసింది.

ఆహ్లాదకరంగా సాగిన ఈ ట్రైలర్ అక్కడక్కడ ‘పెళ్లిచూపులు’ సినిమా ఛాయలు కనపడుతున్నాయి. అమాయకపు అబ్బాయి – దూకుడైన అమ్మాయి మధ్యలో సాగిన భావోద్వేగాలకు తగ్గట్లుగా ‘మెంటల్ మదిలో’ అన్న టైటిల్ ను పెట్టినట్లుగా ఈ ట్రైలర్ స్పష్టం చేస్తోంది. ప్రతి విషయంలోనూ ఏం నిర్ణయించుకోలేని ‘డబుల్ మైండెడ్ అబ్బాయి’ పాత్రలో శ్రీవిష్ణు, తనేం చేయాలో పూర్తి స్పష్టత ఉన్న పాత్రలో నివేతా పేతురాజ్ కనిపిస్తోంది.

వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందించారు. ‘పెళ్లిచూపులు’ సినిమా సక్సెస్ బ్యాక్ గ్రౌండ్ లో ఉంచుకుని ఈ సినిమాను నిర్మించడంతో, పబ్లిసిటీ పరంగా మార్కెట్ చేసుకోవచ్చు. ఆ స్థాయికి తగ్గ సినిమానే మళ్ళీ తెరకెక్కించినట్లుగా కనపడుతోంది. అయితే ఈ ఫీల్ గుడ్ మూవీని ఎంతవరకు ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్లగలరు? అనేది వేచిచూడాలి. ట్రైలర్ పరంగా అయితే ‘ఓకే’ అనిపిస్తుంది.