Mekapati-Goutham-Reddy-YSRCPజగన్ ప్రభుత్వం లూలూ గ్రూప్ కు అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ నిర్మించడానికి ఇచ్చిన 13.85 ఎకరాల భూమి కేటాయింపును ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీని పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. లూలూ గ్రూప్ అయితే ఏకంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో తాము ఎటువంటి పెట్టుబడులు పెట్టమని చెప్పుకొచ్చింది.

ఇది నేషనల్ మీడియాలో కూడా వచ్చి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టింది. దీనిపై ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చెప్పట్టింది. గత ప్రభుత్వం ఇచ్చిన భూమి వ్యవహారం వల్ల 500 కోట్ల నష్టం వాటిల్లుతుందని, అందువల్లే ఆ ఒప్పందం రద్దు చేయడం జరిగిందని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి అన్నారు. అంతేకాక లూలూ గ్రూప్ కు ఇచ్చిన భూమి వివాదంలో ఉందని ఆయన చెప్పారు.

అలాంటి భూములను గత ప్రభుత్వం లూలూ సంస్థకు కేటాయించిందన్నారు. పరిశ్రమలకు ఎక్కడైనా ప్రభుత్వం నష్టానికే భూములు ఇస్తుంది? మార్కెటు రేటుకు కొన్నుకునేదానికి వచ్చి ఆంధ్రప్రదేశ్ లోని పెట్టుబడి పెట్టడం ఎందుకు? పెట్టుబడి పెట్టినందుకు, ఉపాధి కల్పించినందుకు వారికి ఇచ్చి ఇన్సెటివ్స్ ఇవి. ఇది ప్రపంచవ్యాప్తంగా జరిగేదే.

జగన్ హయంలో ఎవరైనా పెట్టుబడి పెట్టాలంటే కూడా అదే చెయ్యాలి.పరిశ్రమల మంత్రికి ఆ మాత్రం కూడా తెలియకపోతే ఎలా? అంటూ టీడీపీ అభిమానులు ఎద్దేవా చేస్తున్నారు. విశాఖలో కేవలం కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు మాత్రమే లూలూ గ్రూపు ముందుకొచ్చిందని, దానిని ప్రభుత్వం కూడా నిర్మించుకోగలదని ఆయన చెప్పారు.  అంతర్జాతీయ స్థాయి కన్వెన్షన్ సెంటర్ అంటే కల్యాణమండపం అన్నంతతేలికగా చెప్పేసారు మంత్రిగారు అంటూ వారు ఎద్దేవా చేస్తున్నారు.