Mekapati Goutham Reddy-వైఎస్ జగన్ జమానాలో పెట్టుబడులు తరలిపోతున్నాయని ప్రజలలో ప్రబలంగా అభిప్రాయం ఉండటంతో ప్రభుత్వం, సాక్షి మీడియా దిద్దుబాటు చర్యలు చేపట్టింది. పరిశ్రమల శాఖా మంత్రి గౌతమ్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి తొందరలో అనంతపురముకు 1000 కోట్ల పెట్టుబడి పెట్టె పరిశ్రమ వస్తుంది అని ఆయన చెప్పుకొచ్చారు.

సాక్షి ఈరోజు వీర వాహన ఉద్యోగ్ అనే బస్సుల తయారి కంపెనీ అనంతపురంలో వస్తుందని, దాని వల్ల అనేక ఉద్యోగాలు వస్తాయని, ఈ ప్లాంటు లో ఏడాదికి 3000 బస్సులు తయారీ అవుతాయని చెప్పుకొచ్చింది. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ సంస్థ 2017లో చంద్రబాబు ప్రభుత్వంతోనే ఈ పెట్టుబడికి ఎంఓయూ సైన్ చేసింది.

ఆ సంస్థ కోరినట్టుగా 120 ఎకరాలు అనంతపురం జిల్లాలోని సోమాండేపల్లి మండలంలోని గుండుపల్లె గ్రామంలో భూమిని గుర్తించారు. ఆ సంస్థకు ఇచ్చే రాయితీలను అధికారికం చేస్తూ జీవో నెంబర్ 44 ఇచ్చింది అప్పటి ప్రభుత్వం. ఈ ప్రాజెక్టును ఇప్పుడు తామే తెస్తున్నామని ప్రభుత్వం బాకా ఊదుకోవడం గమనార్హం.

మరోవైపు జాతీయ మీడియా కూడా వివిధ పరిశ్రమలు తరలిపోవడంపై పెద్ద ఎత్తున కథనాలు ప్రసారం చేస్తుంది. దీనితో ప్రభుత్వం ఇరుకున పడినట్టుగా ఉంది. అయితే ఇప్పటికిప్పుడు పెట్టుబడిదారులను తీసుకుని రావడం కష్టం గనుక ఇది వరకు చంద్రబాబు సాధించిన వాటిని తమ ఖాతాలో వేసుకుంటున్నారు. గతంలో ఇదే జగన్ ఒక ఎన్నికల సభలో చంద్రబాబు మొహం చూసి ఎవరైనా ఏపీలో పెట్టుబడి పెడతారా అనడం గమనార్హం.