mekapati chandra sekhar reddy abusive commentsఇప్పటివరకు ఏపీ ప్రజలకు అధికారిక భాష “తెలుగు” అనే తెలుసు. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజధానితో పాటు భాషా సంస్కృతిని కూడా మార్చినట్లుంది ప్రభుత్వ తీరు. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు భాషను రద్దు చేసి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతుందని అందరు భావించారు., కానీ ప్రభుత్వ అంతరార్ధం వేరే అన్న చందంగా ఉంది వైసీపీ నాయకుల మాట తీరు.

మొదట్లో వైసీపీ మంత్రులలో ఒకరిద్దరు మాత్రమే ఈ బూతుల సంస్కృతిని రాజకీయాలలోకి పరిచయం చేశారు. కానీ రాను రాను ఈ సంస్కృతిని విస్తరించుకుంటూ పోతుంది వైసీపీ పార్టీ. ఏపీలో ఇప్పటికే ఒకరిద్దరు తమ శాఖ పరమైన నిర్ణయాలతో కాకుండా “బూతులమంత్రి” అనే ట్యాగ్ లైన్ తో ఫేమస్ అయ్యారు. ఇప్పుడు ఇదే బాటలో మరికొందరు ఫేమస్ అవ్వడానికి సిద్ధమైనట్లు ఉంది ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తీరు.

వైసీపీ పార్టీలో మెలగాలంటే ఈ మాత్రం బూతులు తప్పనిసరి అని ఎవరైనా సలహా ఇచ్చారో ఏమో కానీ ఉదయగిరి ఎమ్మెల్యే తన పరపతిని అధినాయకత్వానికి తెలపాలనుకున్నారో ఏమో కానీ బూతులతో రెచ్చిపోయారు. అయితే ఇందులో కొసమెరుపేంటంటే చంద్రశేఖర్ రెడ్డి బూతులతో దండయాత్ర చేసింది సొంత పార్టీ వారినేనని తెలియడమే.

ఏందిరా..! ఈ గోల సజ్జలకు నాలుగు రూపాయిలిస్తే పనైపోద్ది అని కూసిన వాడివి నువ్వు.., ఈనేమి ముఖ్యమంత్రిరా బాబు అన్నోడివి నువ్వు.., పార్టీని కించచరిచింది నువ్వే .., బూతులతో ముఖ్యమంత్రినే విమర్శించినోడివి నువ్వు.., అవన్నీ ఇక్కడ చెప్పలేం అంటూనే అన్ని సవవిరంగా చెప్పి ఆ నేత పేరు మాత్రం తన నోటి వెంట రాకుండా చాల చాకచక్యంగా తాను చెప్పాలనుకున్నా లేదా తిట్టాలనుకున్నా నాలుగు బూతులు పబ్లిక్ గా అనేసారు చంద్రశేఖర్ రెడ్డి.

రాజకీయాలలో రాణించాలని ఆశించే భవిషత్ తరానికి రాజకీయ నాయకులిచ్చే సూచనలు, సందేశాలు ఇవేనా అని గొంతెత్తి యువత తిరగబడితే కానీ ఇటువంటి రాజకీయ నాయకులలో “భయం – బాధ్యత” రెండు వస్తాయి అనేది రేపటి తరాన్ని గురించి ఆలోచించే సగటు సామాన్యుడి ఆవేదన. పార్టీ పెద్దగా ఉన్న వారు ఇటువంటి నాయకులను నిరువరించ లేకపోవడం అత్యంత శోచనీయం. ఇటువంటి భాషా సంస్కృతిని ప్రభుత్వం పెద్దలే ప్రోత్సహిస్తూ పోతే రాష్ట్రము యొక్క పేరు – ప్రఖ్యాతులు దిగజారిపోవా అంటూ రాష్ట్ర శ్రేయస్సును కాంక్షించే ప్రతి వాడు ప్రశించే రోజు రాక మానదు.

రాజకీయ నాయకులను విమర్శించే ముందు ప్రజలు కూడా తమ వంతు బాధ్యతగా ఓటు వేసే ముందు ఒక్క క్షణం అలోచించి నిర్ణయం తీసుకుంటే అసలు ఈ విమర్శలు చేసే పరిస్థితి కూడా రాదు అని ఎంతో మంది మేధావి వర్గం ప్రజలకు కూడా చురకలు వేస్తున్నారు. మరి చూడాలి అధికారం లో ఉన్న జగన్ ప్రభుత్వం తమ అధికారిక భాష అయినా “బూతుల సంస్కృతిని” ఇకనైనా మార్చుకుంటుందో లేక దీనిపై కూడా ఏపీ ప్రజలు హైకోర్టును సంప్రదించాలో అనే అయోమయంలో ఉన్నారు సాహితీ ఆభిమానూలు.