Mehreen Kaur Next Projectమెహ్రీన్ ఇప్పుడు కుర్రకారు కలల రాణిగా మారిపోయింది. సినిమా .. సినిమాకి ఆమె క్రేజ్ పెరిగిపోతూ వుంది. ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ .. ‘మహానుభావుడు’ .. ‘రాజా ది గ్రేట్’ తో హ్యాట్రిక్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంది. రీసెంట్ గా ‘కేరాఫ్ సూర్య’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెహ్రీన్, వచ్చేనెల 1వ తేదీన ‘జవాన్’ సినిమాతో పలకరించనుంది.

గ్లామర్ తో మంచి మార్కులు కొట్టేసిన ఈ సుందరిని సంప్రదించే దర్శక నిర్మాతల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా ఆమె మరో కొత్త ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం. గోపీచంద్ హీరోగా దర్శకుడు చక్రి ఒక సినిమాను తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం కొంతమంది పేర్లను పరిశీలించిన దర్శక నిర్మాతలు, చివరికి మెహ్రీన్ ను ఖరారు చేశారట.

లుక్స్ పరంగా ప్రేక్షకుల చేత పెద్దగా ప్రశంసలు అందుకోనప్పటికీ, సక్సెస్ ల పరంగా మాత్రం టాలీవుడ్ లో ‘గోల్డెన్ లెగ్’గా మారడంతో, వరుస ప్రాజెక్ట్ లు ఈ అమ్మడి ఖాతాలో పడుతున్నాయి. తాజా ప్రాజెక్టుకు సంబంధించిన అతి త్వరలో అధికారికం కానున్నాయి.