Meher Ramesh -Mahesh Babu -Friendshipసూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు మొదటి షెడ్యూల్ ఈ మధ్యనే కాశ్మీర్ లో పూర్తి అయ్యింది. కాగా ఆ సినిమా షూటింగ్ గ్యాప్ లో ఆడిన ఒక సరదా క్రికెట్ మ్యాచ్ వీడియో డైరెక్టర్ అనిల్ రావిపూడి విడుదల చేశారు. హేష్ బ్యాటింగ్ చేస్తూ మిగతావాళ్ళని ఉత్సాహపరిచాడు . ఈ ఆటలో మహేష్ తనయుడు గౌతమ్ కూడా పాల్గొనడం విశేషం. మహేష్ బాబు , గౌతమ్ లతో పాటుగా అనిల్ రావిపూడి , వంశీ పైడిపల్లి , మెహర్ రమేష్ లతో పాటుగా సరిలేరు నీకెవ్వరు చిత్ర యూనిట్ లోని మరికొందరు కలిసి ఈ క్రికెట్ ఆటలో పాల్గొన్నారు.

గౌతమ్ తనని బౌల్డ్ చేసినట్లుగా పేర్కొంటూ ఈ క్రికెట్ తాలూకు వీడియో ని ట్వీట్ చేసాడు అనిల్ రావిపూడి. ఈ వీడియో చూస్తూ అభిమానులు ఖుష్ అయ్యారు. కాకపోతే చాలా కాలం నుండి మెహర్ రమేష్ మహేష్ బాబుతో పాటూనే ఉంటున్నారు. ఆయన మహేష్ కు మంచి స్నేహితుడని సమాచారం. కాకపోతే సినీ ప్రేక్షకులలో మెహర్ రమేష్ అంటే చాలా భయాలు ఉన్నాయి. ఆయన చివరి రెండు సినిమాలు – శక్తి,, షాడో ఆయా హీరోల కేరీర్ లో అట్టర్ ప్లాప్ సినిమాలు…. ఫలితం అటుంచితే వారి కేరీర్ లో ఆ సినిమాలు బ్లాక్ మార్క్స్.

ఫ్రెండ్ షిప్ కోసం మెహర్ కు ఏమైనా ఛాన్స్ ఇస్తాడేమో మహేష్ అని ఆయన అభిమానుల టెన్షన్. మనకు ఉన్న సమాచారం ప్రకారం మెహర్ కు కూడా మహేష్ తప్ప ఇప్పుడు వేరే ఆప్షన్ కూడా కనిపించలేదట. ఇది ఇలా ఉండగా సరిలేరు నీకెవ్వరు వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల అవుతుంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. చాలా కాలం తరువాత తిరిగి సినిమాలలోకి ఎంటరైన విజయశాంతి నిన్న మొదటి సారి సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు.