Meher-Ramesh--Mahesh-Babuతెలుగు ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ మెహర్ రమేష్. కన్నడలో బ్లాక్ బస్టర్ సినిమాలు చేసిన ఈయన తెలుగులో మాత్రం డిజాస్టర్ డైరెక్టర్ అయిపోయాడు. ఈయన చేసిన నాలుగు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకులను మెప్పించలేక.. నిర్మాతలను కూడా నిండా ముంచేసాయి. దాంతో మెహర్ పేరు ఎత్తినేనే నిర్మాతలతో పాటు హీరోలు కూడా పారిపోతున్నారు. ఈయన చేసిన కంత్రి, బిల్లా, శక్తి, షాడో అన్నీ ఫ్లాపులే. దాంతో మెహర్ రమేష్‌ను నమ్మడం పూర్తిగా మానేసారు నిర్మాతలు.

ఆయన చివరి సినిమా షాడో వచ్చి ఆరేళ్లవుతున్నా కూడా ఇప్పటికీ ఈయన జోలికి ఎవరూ వెళ్లడం లేదు. ఈ మధ్య తరచు మహేష్ బాబు కూడా కనిపిస్తూ మహేష్ అభిమానులను కలవరపెడుతున్నాడు. ఇది ఇలా ఉండగా ఆయన డైరెక్షన్ మాట ఎలా ఉన్న ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ గా అవతారం ఎత్తుతున్నాడు. అది కూడా మహేష్ బాబు సినిమా తోనే. మెహర్ రమేష్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా గుంటూరు హక్కులను భారీ రేటుకు కొన్నారని సమాచారం.

పద్మాకర్ సినిమాస్ ద్వారా సినిమా గుంటూరులో విడుదల అవుతుంది. ఈ రకంగానైనా మెహర్ రమేష్ సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి. సరిలేరు నీకెవ్వరు షూటింగ్ శరవేగంగా సాగుతుంది. రామోజీ ఫిలిం సిటీలో నిర్మించిన కొండారెడ్డి బురుజు సెట్ లో షూటింగ్ జరుగుతుంది. సంక్రాంతికి సినిమాను విడుదల చెయ్యడానికి సిద్ధం చేస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి ఎఫ్2 తో భారీ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో హైప్ ఎక్కువగా ఉంది.