Megha Akashమేఘా ఆకాష్! లై సినిమాతో లయబద్దంగా ఉన్నది అని మంచి పేరు దక్కించుకున్న ఈ భామకు పాపం ఆ సినిమా భారీ ఫ్లాప్ గా మిగలడంతో మరో అవకాశాన్ని అందించాడు నితిన్. తన తర్వాత సినిమా చల్ మోహన రంగాలో కూడా మరో అవకాశం ఇచ్చి బాగా ఎంకరేజ్ చేసాడు. కట్ చేస్తే పాపం ఆ సినిమా కూడా గోవింద నామం పెట్టింది.

ఇక చేసేది ఏముంది..తెలుగులో మనకు కలసి రాదు అని అర్ధం చేసుకున్న ఈ భామ, తమిళంలో తన అదృష్టాన్ని పరీక్షించుకునే క్రమంలో “ఎన్నై నొక్కి పాయుం తోట” సినిమాను ఒప్పుకుంది, అయితే ఆ సినిమా విడుదల కూడా కాకపోవడంతో, అంటా అయిపోయింది అని అనుకునేలోపే తమిళ తలైవర్ రజని సినిమా పేటలో మంచి పాత్ర దక్కింది. కట్ చేస్తే మెయిన్ రోల్ కాకపోయినా, పర్వాలేదు అనిపించుకునే పాత్ర,ఇక ఈ సినిమా హిట్ అయ్యింది.

ఇంకేం ఉంది, ముద్దు గుమ్మ మేఘా ఆకాష్ కి ఫస్ట్ హిట్ అన్న మాట. ఇక ఈ హిట్ తో ఈ భామకు నాని-విక్రమ్ కుమార్ కాంబినేషన్లో రూపు దిడుకొనున్న చిత్రంలో ఛాన్స్ వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి..అదే నిజం అయితే మాత్రం ఈ బ్యూటీ హిట్ ట్రాక్ ఎక్కినట్లే.