Megastar chiranjeevi speech at godfather press meetమెగాస్టార్ చిరంజీవి హీరోగా లూసిఫర్ సినిమా తెలుగు రీమేక్ ‘గాడ్ ఫాదర్’ రేపు విడుదలకు సిద్ధమవుతుంది. ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ లో చిరంజీవి చెప్పిన మాటలు విన్న మలయాళీలు మండిపడుతున్నారు. మెగాస్టార్ మాట్లాడుతూ

“ఒరిజినల్ లూసిఫర్ చూస్తున్నపుడు మధ్య మధ్య లో ఇలా ఉందేంటి, కొంచెం బోర్ కొడుతుందే, ఇది వేరేలా తీస్తే బావుండును అని అనిపించింది” అని అన్నారు. తాను లూసిఫర్ తెలుగు వెర్షన్ చూసినా కొంచం అర్ధం కాలేదన్నారు.

అయితే గాడ్ ఫాదర్ దర్శకుడు మోహన్ రాజా చెప్పిన ఒక చిన్న మార్పు మెగాస్టార్ ని ఈ రీమేక్ చెయ్యడానికి సాహసించేలా చేసిందని, తెలుగు వారికి నచ్చేలా మోహన్ రాజా చాలా మార్పులు చేశారని, రచయిత సత్యానంద్ కూడా ఎంతో సహకరించారని మెగాస్టార్ చెప్పారు. తెలుగు ప్రేక్షకుల కోసం చాలా మార్పులు చేశామన్నారు. కొన్ని కొత్త పాత్రలు కూడా సృష్టించామన్నారు.

ఇక దర్శకుడు మోహన్ రాజా కూడా లూసిఫర్ సినిమా తనకి ఎంతో నచ్చిన సినిమా అని, ఒరిజినల్ లో కంటే రీమేక్ లో హీరో ఎక్కువసేపు కనిపిస్తారని, ఫాన్స్ రోమాలు నిక్కబొడిచే సన్నివేశాలు ఉన్నాయని, ముఖ్యంగా ఇంటర్వెల్ బాంగ్ ఫాన్స్ కి కిక్ ఇస్తాయని చెప్పారు. మోహన్ రాజా చాలా నమ్మకంగా చెప్పడం చూస్తే, ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందనిపిస్తుంది.

లూసిఫర్ మలయాళం లో సూపర్ హిట్ అయ్యింది, కానీ తెలుగు డబ్బింగ్ చూస్తే సినిమా కొంచెం స్లోగా ఉందని, హీరోయిజం తక్కువగా ఉందని మనకి అర్ధం అవుతుంది. మలయాళంలో ఉన్నది ఉన్నట్లు తీస్తే తెలుగులో ఖచ్చితంగా ఆడదు. మెగాస్టార్ కి ఉన్న మాస్ ఇమేజ్ కి తగినట్లు లూసిఫర్ ఉండదు. అందులోనూ మలయాళం హీరో మోహన్ లాల్ లా చిరు అప్పుడప్పుడూ సినిమాలో కనిపిస్తే, తెలుగు ప్రేక్షకులు ఊరుకోరు. అందుకే తెలుగులో రీమేక్ చేసేటప్పుడు మార్పులు తప్పనిసరి.

మెగాస్టార్ చిరంజీవి చెప్పినది నిజమే, అయన చెప్పినవన్నీ కరెక్టే. కానీ మలయాళీలు కోపంతో లూసిఫర్ పార్ట్ – 2 రైట్స్ చిరంజీవికి ఇవ్వద్దని మలయాళ దర్శకుడు పృథ్వీ రాజ్ కి ట్విట్టర్ లో ట్వీట్లు పెడుతున్నారు. చిరు కి లూసిఫర్ లో డాన్సులు, హీరోయిన్ లేకపోవడం వెరైటీగా తోచిందని ఎద్దేవా చేస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి తెలుగు ప్రజల హీరో, తెలుగు ప్రజలు ఎలాంటి అంశాలు కోరుకుంటారో బాగా తెలిసిన వ్యక్తి. 150 సినిమాలు పూర్తిచేసిన హీరోకి తన ప్రేక్షకుల నాడి తెలియదా?. అయినా మెగాస్టార్ భోళా శంకరుడు మనసులో ఉన్నది ఉన్నట్లు చెప్పేయడం ఆయనకు అలవాటు. కానీ రీమేక్ రిలీజ్ చేస్తున్నపుడు ..మెగాస్టార్ ఒరిజినల్ ని విమర్శించకుండా ఉంటే బావుండును. అయినా మెగాస్టార్ చెప్పింది నిజమేగా! తెలుగు ప్రజల మద్దతు ఎప్పుడు చిరువైపేగా. రేపు రిలీజ్ అయ్యే గాడ్ ఫాదర్ ఎలాంటి రికార్డ్స్ సృష్టిస్తుందో చూడాలి.