Chiranjeevi-To-Distance-From--Congressమెగాస్టార్ చిరంజీవి తన రాజ్యసభ ఎంపీ పదవి అయిపోయాకా రాజకీయాల నుండి విరమించుకుని పూర్తిగా సినిమాల పై దృష్టి సారించారు. ఆయన సెకండ్ ఇన్నింగ్స్ లో చేసిన రెండు సినిమాలు – ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహ రెడ్డి రెండు 100 కోట్ల షేర్ ని దాటింది. ప్రభాస్ తరువాత ఇటువంటి రికార్డు ఎవరికీ సాధ్యం కాలేదు.

సైరా నరసింహ రెడ్డి చిరంజీవి మొదటి హిస్టారికల్ చిత్రం. దానిని ఆయన చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు. దానిని సమాజంలోని ప్రముఖులకు చూపించి మురిసిపోతున్నారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై కు స్పెషల్ షో వేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని స్వయంగా వెళ్లి సినిమాను చూడమని ఆహ్వానించారు.

ఆ తరువాత ఢిల్లీ వెళ్లి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు ఢిల్లీ వెళ్లి స్పెషల్ షో వేయించారు చిరంజీవి. సినిమా చూడాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోమ్ మంత్రి అమిత్ షాలకు లెటర్ రాశారు చిరంజీవి. అయితే కాంగ్రెస్ పెద్దలను గానీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని గానీ చిరంజీవి కదల్లేదు.

బీజేపీ వర్గాల సమాచారం బట్టి రాష్ట్రపతి కోటాలోని రాజ్యసభ ఎంపీ సీటు మీద చిరంజీవి కన్నేశారట. ఈ మధ్య కాలంలో మోడీ ప్రభుత్వం షబానా అజ్మీ, జావేద్ అక్తర్, లత మంగేష్కర్ లను రాజ్యసభ కు నామినెట్ చేశారు. ఇప్పుడు చిరంజీవి ఆ పదవి కోసం బీజేపీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి.