Megastar Chiranjeevi conversation media peopleమెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా ప్రచారంలో భాగంగా విలేఖరులు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలిస్తూ..రీమేక్ సినిమాల పై తనకున్న అభిప్రాయాన్ని వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవి చాలా సినిమాలను రీమేక్ చేశారు. ఇటీవల విడుదలైన గాడ్ ఫాదర్ సినిమా కూడా మళయాళ రీమేక్.

చిరంజీవి మాట్లాడుతూ ..రీమేక్ చెయ్యడం అంత సులువు కాదన్నారు. రీమేక్ చేసేటప్పుడు తెలుగు మార్కెట్ కి అనుగుణంగా, హీరో ఇమేజ్ కి తగినట్లుగా చాలా మార్పులు చేయాలన్నారు. బాలీవుడ్ తరువాత అతి పెద్ద సినిమా మార్కెట్ తెలుగు సినిమాదే అని, ఒరిజినల్ సినిమాని యథాతథం గా తీస్తే జనాలు చూడలేరన్నారు.

అందుకు ఉదాహరణగా చిరంజీవి తమిళ సినిమా ‘రమణ’ గురించి చెప్పారు. తమిళ్ లో మురుగదాస్ దర్శకత్వం లో, విజయకాంత్ హీరోగా చేసిన రమణ సినిమా సూపర్ హిట్. ఆ సినిమా క్లైమాక్స్ లో విజయకాంత్ చనిపోతారు. తెలుగు లో రమణ సినిమా ని ఠాగూర్ పేరుతో రీమేక్ చేసినపుడు, హీరో పాత్రని చనిపోకుండా చేయడం వలన ఠాగూర్ హిట్ అయ్యిందన్నారు చిరంజీవి. తెలుగులో పెద్ద హీరోలు క్లైమాక్స్ లో చనిపోతే సినిమాలు ఖచ్చితంగా ప్లాప్ అవుతాయనడానికి నాగార్జున అంతం, మహేష్ బాబీ, ప్రభాస్ చక్రం ఉదాహరణలు.

తమిళ ప్రేక్షకులు విషాదకరమైన ముగింపులు చూసి హిట్ చేస్తారు కానీ.. తెలుగు ప్రేక్షకులు మాత్రం హీరో చనిపోతే అస్సలు ఒప్పుకోలేరు. తెలుగు ప్రేక్షకులు హీరోలను అంతగా ఆరాధిస్తారు. కనుక ఇక్కడ క్లైమాక్స్ లో హీరో చనిపోతే, ప్రొడ్యూసర్ పోతాడు. అందుకే తెలుగు హీరోలు ఇలాంటి క్లైమాక్స్ ల జోలికి వెళ్లరు!