Who Got Nagababu's Interview Promo Removed?గత ఎన్నికల్లో మెగా బ్రదర్ నాగబాబు జనసేన పార్టీ కోసం యూట్యూబ్ యుద్ధం చేశారు. యూట్యూబ్ వీడియోలతో అప్పటి ప్రభుత్వాన్ని మరీ ముఖ్యంగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ని టార్గెట్ చేసేవారు. అయితే పవన్ కళ్యాణ్ చివరి నిమిషంలో ఆయనను పిలిచి నరసాపురం ఎంపీ టిక్కెట్ ఇచ్చారు. అయితే ఆ ఎన్నికలలో నాగబాబు మూడవ స్థానంతోనే సరిపెట్టుకున్నారు.

అప్పటి నుండి రాజకీయాలకు దూరంగా ఉన్నారు నాగబాబు. ఒక పార్టీ సమీక్షా సమావేశం లొనే ఆయన కనిపించారు. మళ్ళీ ఇన్నాళ్లకు తిరిగి తెర మీదకు వచ్చారు. రేపు విశాఖపట్నం లో జనసేన లాంగ్ మార్చ్ సందర్భంగా అక్కడ ప్రత్యక్షం అయ్యారు. మార్చ్ సందర్భంగా రెండు రోజుల ముందే విశాఖ వచ్చి ఏర్పాట్లను పర్యవేక్షించారు.

అన్నీ దగ్గరుండి చూసుకుంటున్న నాగబాబు జగన్ ప్రభుత్వంపై సీరియస్ అయ్యారు. ఇసుక కొరత వలన పనులు లేక భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడడం బాధాకరమని, కార్మికులకు అండగా ఉండేందుకే పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ నిర్వహిస్తున్నారని అన్నారు. అంతేకాదు ఓదార్పు యాత్ర చేసిన జగన్‌కు కార్మికుల కష్టాలు కనబడడం లేదా అని ప్రశ్నించారు.

అంతేకాదు ప్రజల కోసం ప్రభుత్వంపై జనసేన పోరాడుతూనే ఉంటుందని, తప్పు చేస్తే ప్రజల పక్షాన నుంచి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని అన్నారు. నాగబాబు నిత్యం ప్రజలలో ఉండి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తే అటు పార్టీకి ఇటు ఆయన రాజకీయ జీవితానికీ మంచిది. సినిమాలలో గెస్ట్ ఆర్టిస్టుల మాదిరి అప్పుడప్పుడు వచ్చి పోతూ ఉంటే పెద్దగా ఉపయోగం ఉండదు.