mega-fans-worried-about-sye-raa-narasimha-reddy-music-director-julius-packiamమెగాస్టార్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘సైరా’ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గాంధీ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా నాలుగు భాషల్లో ఒకేరోజు విడుదల కాబోతుంది. అయితే ఇప్పుడు సినిమా గురించి తాజాగా వచ్చిన వార్త అభిమానులు కలవరపెడుతుంది. మొదట్లో బాలీవుడ్ కు చెందిన అమిత్ త్రివేదిని ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నారు. అయితే ఇప్పుడు చిత్రం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం వేరే మ్యూజిక్ డైరెక్టర్ ను తెచ్చారు.

ఏక్ తా టైగర్, భజరంగి భాయిజాన్, భారత్ వంటి బడా సినిమాలకు సంగీతం అందించిన జూలియస్ ప్యాక్ఇఅం ను తెర మీదకు తెచ్చారు. సమయాభావం వల్లే కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ను తీసుకుని రావాల్సి వచ్చిందని చిత్ర బృందం చెప్పింది. సమయాభావం అన్న పదమే ఇప్పుడు మెగా అభిమానులను కలవరపెడుతుంది. సైరా వంటి దేశభక్తి చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అనేది చాలా కీలకం అటువంటిది దాని కోసం చివరి నిముషం వరకూ పని చెయ్యడం మంచి సంకేతం కాదు.

మరోవైపు ఎడిటింగ్ విషయంలో కూడా చిరంజీవి స్పెషల్ కేర్ తీసుకుంటున్నారట. చిరంజీవి స్వయంగా ఎడిటింగ్ టేబుల్ వద్ద కూర్చుని ఆ పని స్వయంగా చేస్తున్నారట. రన్ టైం వీలైనంత తక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. మరోవైపు 1న అమెరికా లో ప్రీమియర్లు ఉంటాయి. అక్టోబర్ 1 మంగళవారం కావడంతో అమెరికాలో సహజంగా ఉండే ఆఫర్లు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఖైదీ నెం 150 ప్రీమియర్లేకే వన్ మిలియన్ డాలర్స్ గ్రాస్ రాబట్టింది. సైరా కు అదే టార్గెట్ కాబోతుంది.