Chiranjeevi-Sye-Raaమెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రం ట్రైలర్ నిన్న విడుదల అయ్యింది. చిత్రంలో చిరంజీవి ఆహార్యం, మేక్ అప్ మీద ఇప్పటికే నెగటివ్ ఉండగా ట్రైలర్ దానిని మరింత పెంచింది. చిరంజీవి డైలాగ్ డెలివరీ కూడా కొంత ఫోర్స్డ్ గా ఉండడంతో సోషల్ మీడియాలో ట్రాల్స్ పండగ చేసుకుంటున్నాయి. ఈ సినిమా మీద చిరంజీవి ఆహార్యం మీద పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు.

అయితే మెగా అభిమానులు మాత్రం దీనికి తీవ్ర అభ్యంతరం వ్యక్తం ప్రపంచానికి తెలియని ఒక యోధుడి కథను చిరంజీవి చెప్పే ప్రయత్నం చేస్తున్నారని, ఒక తెలుగు వాడికి మనం అందరం దానికి మద్దతు తెలపాలని వారి వాదన. కొందరు ఈ ఏజ్ లో చిరంజీవి స్లిమ్ గా ట్రిమ్ గా ఉండాలని కోరుకోవడం తప్పని దాని వల్ల ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని వాదిస్తున్నారు.

ఈ వాదనలో కొంత మేర నిజం కూడా ఉంది. అయితే గతంలో ఇవే పరిస్థితులు నందమూరి బాలకృష్ణ వంద చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణికి కూడా ఉన్నాయి. తెలుగుజాతికి గర్వకారణమైన ఒక రాజు కథ బాలయ్య చెప్పాడు…. బాలయ్య వయసుకూడా తక్కువేమి కాదు ఇప్పుడు స్లిమ్ అవ్వడానికి… అయినా మెగా ఫాన్స్ వదల్లేదు. ఇప్పటికే ఆ సినిమాలోని ఫొటోస్ తో బాలయ్య ను విమర్శిస్తూనే ఉంటారు.

మన దాకా వచ్చే సరికి నీతులు సూక్తులు చెబితే ఎలా? ఇదే వివరం అప్పుడు ఉంటే ఇప్పుడు మిగతా వారికి ఉండేదని మిగతా హీరో అభిమానులు అంటున్నారు. 60వ పడిలో కూడా తమ అభిమానుల కోసం, సినీ కళామాతల్లి కోసం చిరంజీవి, బాలయ్య లాంటి హీరోలో ఇంత కష్టపడుతుంటే విమర్శ చెయ్యొచ్చు మరీ ట్రాల్ చెయ్యడం తప్పే కదా?