Mega fans satirical poems on Garikipati Narasimha Raoమెగాస్టార్ చిరంజీవి – గరికపాటి మధ్య జరిగిన గొడవ అందరికి తెలిసిందే. చిరు అన్నదమ్ములు, అభిమానులు, ఆత్మీయులు అందరూ గరికపాటి మీద బాగా కోపగించుకున్నారు. కొంత మంది మాటల ద్వారా, కొంత మంది దుర్భాషలతో, కొంత మంది కవితల ద్వారా తమ అసహనాన్ని గరికపాటి వారి మీద ప్రదర్శించారు.

ఇవన్నీ చూస్తూ మెగాస్టార్ చిరంజీవి కేవలం చిరునవ్వు తో స్పందించగా..గరికపాటి గారు మాత్రం మీడియా కి దూరం గా ఉన్నారు. చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లు! గొడవ జరిగే చాలారోజులైనా మెగా అభిమానులు గరికపాటి పై ఎటాక్ చేయడం మాత్రం ఆపటం లేదు. ఇది నిజంగా అభిమానులే స్వయంగా చేస్తున్నారా? లేక వెనుక ఉండి ఎవరైనా చేయిస్తున్నారో మనకు తెలియదు. కానీ ఇప్పుడు ఏకంగా ఇప్పుడు ఫాన్స్ ప్రెసిడెంటే క్లారిటీ ఇచ్చేసారు.

గరిక పాటి మీద ఈ శంకర్ దాదా అభిమానులు తవికలతో గాంధీగిరి చేస్తున్నారు. ఇదొక కొత్త టైపు కెలుకుడు. గరికిస్తాం, పువ్విస్తాం, ఏదిచ్చినా గరికపాటి వారు పక్కన పాడేసుకోవడమే తప్ప, దేనినీ వాడుకోలేరు అనే విధం గా గాంధీగిరి కవితలు రాస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే..నిద్రపోతున్న గరికపాటిగారి మీద రాళ్లు వేసి లేపి, గొడవని మరింత పెంచడానికే అన్నట్లు కనిపిస్తుంది. ఇటువంటి సందర్భాల్లో హీరోలు అభిమానుల్ని అదుపు చెయ్యలేరు కానీ.. కనీసం ఆపండని చెప్తే హుందాగా ఉంటుంది. ఇంత జరిగినా కూడా ఇప్పటికీ మౌనంగానే ఉంటె అభిమానుల్ని ప్రోత్సహిస్తున్నట్లుంటుని.. మౌనం అర్ధాంగీకారం మర్చిపోకండి మెగాస్టార్.