Mega family ban on comedian prudhvi30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి ఎన్నికల ముందు వైఎస్సార్ కాంగ్రెస్ కోసం సామాన్య కార్యకర్తలా పని చేసారు. సహజంగా సినిమా యాక్టర్లు రాజకీయ పార్టీలకు మద్దతు ఇచ్చినా వెళ్లి నాలుగు ఫోటోలు తీయించుకుని వచ్చేస్తారు. అయితే పృథ్వి మాత్రం జగన్ వెంట నడిచి రిస్క్ అని తెలిసినా ప్రభుత్వం మీద ఇతర పార్టీల మీద విమర్శలు చేసేవారు. ఒక ఇండస్ట్రీ వాడైనా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కూడా వదల్లేదు పృథ్వి. అయితే ఇప్పుడు దానికి తగిన మూల్యం చెల్లిస్తున్నారు.

ఇండస్ట్రీలో ఆయన మీద అనధికార బ్యాన్ ఉందని సమాచారం. మెగా హీరోలు అయితే ఆయన తమ సినిమాలలో నటించడానికి ససేమిరా అంటున్నారట. ఇటీవలే అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమాలో ఆయనను ఒక కీలక పాత్ర కోసం సంప్రదించారట. అంతా ఓకే అనుకున్నాకా షూటింగ్ మొదలయినా పిలుపు రావడం లేదట. ఏంటని కనుకుంటే ఆ పాత్రకు ఇంకొకరిని తీసేసుకున్నాం అని చెప్పారట. అల్లు అర్జున్ అభ్యంతరం చెప్పడమే దీనికి కారణం అంటున్నారంతా.

మెగా ఫ్యామిలీ బ్యాన్ అంటే పృథ్వికి నష్టం అంతా ఇంతా కాదు. ఎందుకంటే ఇండస్ట్రీ అంతా వారే ఉంటారు. మిగతా సినిమాల వారు కూడా పృథ్విని తీసుకోవడనికి జంకుతున్నారు. అయితే పృథ్వికి జగన్ ఏదైనా మంచి నామినేటెడ్ పోస్టు ఇస్తే ఈ నష్టాన్ని పూడ్చుకోగలరు. మరి జగన్ ఏం చేస్తారో చూడాలి. ఇటీవలే ప్రభుత్వం మారడంతో సీనియర్ నిర్మాత అంబికా కృష్ణ ఖాళీ చేసిన ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి తనకు ఇస్తారని పృథ్వి ఆశిస్తున్నారు.