Meeku Maathrame Cheptha Censor Reportవిజయ్‌ దేవరకొండ ప్రొడక్షన్‌ హౌస్‌ కింగ్‌ఆఫ్‌ ద హిల్‌ ఎంటర్‌టైన్మెంట్‌ పతాకంపై రూపొందిన సినిమా ‘మీకు మాత్రమే చెప్తా’. తనను హీరోగా పరిచయం చేసిన తరుణ్ భాస్కర్ ను విజయ్ దేవరకొండ ఈ సినిమాతో తరుణ్ ను హీరోగా పరిచయం చేస్తున్నాడు. నవంబర్ 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. కాసేపటి క్రితం సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది.

ఈ సినిమాకు యూఏ సర్టిఫికెట్ ఇవ్వడం విశేషం. నవంబర్ 1న రవిబాబు దర్శకత్వం వహించిన ఆవిరి సినిమా మాత్రమే మీకు మాత్రమే చెప్తాకు పోటీ కాబోతుంది. రవిబాబు ఉన్న ఫామ్ కారణంగా అసలు ఆవిరికి ఎటువంటి హైప్ లేదు. దానితో మీకు మాత్రమే చెప్తాకు పెద్దగా పోటీ లేదనే చెప్పుకోవాలి.

మీకు మాత్రమే చెప్తా డైరెక్టర్ షమ్మీర్‌ సుల్తాన్‌ ఈ సినిమా కాన్సెప్ట్ మొదట విజయ్‌కు చెప్పాడట, అప్పటి కి అర్జున్ రెడ్డి విడుదల కాలేదు. అర్జున్ రెడ్డి విడుదల తరువాత విజయ్ చేద్దాం అనుకున్న ప్రాజెక్ట్ ఇది. కానీ అర్జున్ రెడ్డి విజయ్ కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. అందుకే విజయ్ ఈ సినిమాలో యాక్ట్ చేయకుండా ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

షమ్మీర్‌ సుల్తాన్‌ మొదటి సినిమా ఇది. ఈ సినిమాలో జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్, అభినవ్ గోమటం, పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్, వాణి భోజన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరి హీరోగా సంచలనాలు సృష్టించిన విజయ్ దేవరకొండ.. నిర్మాతగా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.