mastizaade-trailer-talk-for-adults-onlyసన్నీలియోన్, తుషార్ కపూర్, విర్ దాస్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న “మస్తీ జాదే” చిత్రం జనవరి 29వ తేదీన విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన మోషన్ పిక్చర్, టీజర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేయడంతో… ధియేటిరికల్ ట్రైలర్ కోసం కొన్ని రసిక హృదయాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.

ఆ ట్రైలర్ కు కూడా ముహూర్తాన్ని ఖరారు చేసారు. ఈ రోజు రాత్రి 9 గంటలకు “మస్తీ జాదే” ధియేటిరికల్ ట్రైలర్ ను విడుదల చేస్తున్నామని మరో హాట్ టీజర్ ను విడుదల చేయడం విశేషం. “మస్తీ జాదే” ట్రైలర్ కున్న ప్రాధాన్యత రీత్యా ఈ హాట్ టీజర్ కూడా వెబ్ మీడియాలో సందడి చేస్తోంది. ఈ సినిమాను చూసి సెన్సార్ బోర్డే అవాక్కయ్యిందన్న సమాచారంతో “మస్తీ జాదే” ట్రైలర్ ఏ విధంగా ఉండబోతుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.