Maruthi Rao Daughter amrutha responds on father suicideమిర్యాలగూడ పరువు హత్య నిందితుడు మారుతీ రావు ఆత్మహత్య సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. ఈరోజు మిర్యాలగూడలో ఆయన అంత్యక్రియలు జరిపారు. తండ్రిని కడసారిగా చూడటానికి శ్మశానవాటికకు వెళ్లిన అమృతని అక్కడకి రానివ్వలేదు. అమృత గో బ్యాక్ అంటూ నినాదాలతో ఆ ప్రదేశమంతా మారుమోగింది.

దీనితో ఆమె చేసేది ఏమీ లేక తండ్రి శవాన్ని చూడకుండానే వెళ్లిపోవాల్సి వచ్చింది. ఆ తరువాత మీడియతో మాట్లాడిన అమృత .. బాబాయ్ నుంచి అమ్మకు ప్రాణహానీ ఉంటుందని అమృత ఆరోపించింది. శ్రవణ్‌ రెచ్చగొట్టడం వల్లే మారుతీరావు తప్పు చేశాడనుకుంటున్నానని అమృత అనుమానం వ్యక్తం చేసింది.

“ప్రణయ్ చనిపోయినప్పుడే బలంగా ఉన్నా.. ఇప్పుడెందుకు ఉండలేను. కరీంతో పాటు చాలా మంది పేర్లపై బినామీ ఆస్తులున్నాయి. నా పేరుపై ఎలాంటి ఆస్తులు లేవు. నా తల్లి దగ్గరకి వెళ్లి ఉండలేను.. నాతో ఉంటానంటే అభ్యంతరం లేదు. అత్తింటి వారిని వదిలి వెళ్లడానికి సిద్ధంగా లేను’’ అని అమృత చెప్పుకొచ్చింది.

అయితే భర్తని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లిని పట్టించుకోవడం లేదంటూ అమృత మీద పలువురు విమర్శలు చేస్తున్నారు. ఏది ఏమైనా కోపం, మూర్కత్వం, కుల పిచ్చి వంటి కారణాలతో రెండు కుటుంబాలు నాశనం అయిపోయాయి. ఇద్దరు వ్యక్తుల చావుకు కారణం అయ్యాయి.