maoists supports pawan kalyan janasenaజనసేన పార్టీకి మద్దతుగా పని చేస్తున్న కొన్ని సోషల్ మీడియా పేజీలలో ఆసక్తికరమైన పోస్ట్లు వచ్చాయి. జనసేన ప్రజల పార్టీ దానికి ఓట్లేసి మద్దతివ్వండి అంటూ ఏజెన్సీ ప్రాంతాల్లో మావోయిస్టుల పోస్టర్లు. మీడియా ఈ వార్తని తొక్కిపెట్టింది. ఈ ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు ఎన్నికలు భహిష్కరిస్తామని, తుపాకీతో రాజ్యాధికారం అంటూ అడవి బాట పట్టిన విప్లవ వీరులు ఇప్పుడు జనసేనకు మద్దతు తెలపటం భేష్ అని ఆ పోస్టుల సారాంశం.

అయితే దీనిపై జనసేన అభిమానులలో కూడా కలవరం మొదలయ్యింది. దీని వల్ల జనసేన పార్టీ మావోయిస్టు పార్టీ అని ముద్ర పడే అవకాశం ఉందని వారు ఆందోళన చెందుతున్నారు. వామపక్ష వాదమును ఎక్కువగా అభిమానించే పవన్ కళ్యాణ్ గతంలో జరిగిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావు హత్యను కూడా ఖండించలేదని పవన్ పై ఆరోపణలు ఉన్నాయి.

కిడారి, సివేరి సోమల కుటుంబ సభ్యులు పవన్ వైఖరికి నిరసనగా అప్పట్లో నిరసన కూడా తెలిపారు. తరచు మావోయిస్టు సిద్ధాంతాలకు, కమ్యూనిజం కు సంబందించిన పుస్తకాలు చదివే పవన్ కళ్యాణ్ కు మావోయిస్టులు మద్దతు తెలిపారా? లేక ఇది పవన్ కళ్యాణ్ ను సమర్ధించే కొన్ని సోషల్ మీడియా పేజీల అత్యుత్సాహమా? ఇది జన ప్రాబల్యంలోకి వెళ్తే మాత్రం జనసేనకు ఇబ్బందే. మావోయిస్టులకు ప్రజల మద్దతు ఉంది అనేది ఒకప్పటి మాట ఇప్పుడు వారు నిజజీవితానికి దూరంగా హింసకు దగ్గరగా ఉండే వారని అత్యధికులలో అభిప్రాయం.