Many following jd lakshmi narayana foot stepsసీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ ఇటీవలే తన పదవికి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న సంగతి తెలిసిందే. అయన త్వరలో రాజకీయాల్లోకి వస్తారని ఆ పార్టీలో జాయిన్ అవుతారని, ఈ పార్టీలో జాయిన్ అవుతారని ఊహాగాలను నడుస్తున్నాయి. అయితే లక్ష్మీనారాయణతో కలసి నడిచేందుకే తన పదవికి రాజీనామా చేసినట్లు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి రాజగోపాల్ తెలిపారు.

లక్ష్మీనారాయణతో కలిసి పని చేసిన చాలా మంది ఇప్పుడు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని ఆయనతో కలిసి నడవడానికి సిద్ధపడుతున్నారట. వీరంతా ఆయనతో మాట్లాడే వస్తున్నారా అనేది మాత్రం చెప్పడం లేదు. పైగా లక్ష్మీనారాయణ ఏ నిర్ణయం తీసుకుంటారో ఇంకా తెలియదని, ఆయన ఏం చేసిన ఆయన వెంట నడుస్తామని అంటున్నారు.

ఎపిలో సంచలనం సృష్టించిన వైఎస్‌ జగన్‌ అక్రమాస్తుల కేసు, గాలి జనార్దన్‌రెడ్డి మైనింగ్‌ కేసుల వ్యవహారంతో పాటు సత్యం కంప్యూటర్స్ కేసు అప్పటి సీబీఐ జెడి లక్ష్మీనారాయణ అత్యంత కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. 1990 బ్యాచ్ మహారాష్ట్ర క్యాడర్ ఐపిఎస్ ఆఫీసర్ అయిన లక్ష్మీ నారాయణ 2006 లో డిప్యుటేషన్ మీద ఆంధ్రప్రదేశ్ సిబిఐ రీజనల్ జాయింట్ డైరెక్టర్ గా నియమించబడ్డారు. ఆ తరువాత తను సొంత క్యాడర్ మహారాష్ట్రకు ట్రాన్స్ ఫర్ అయిన ఆయన ఇప్పుడు అక్కడ ఆ రాష్ట్రానికి అడిషనల్ డీజీగా పనిచేస్తున్నారు.