manu-trailer-talk--a-unique-experienceనవతరం దర్శకుల రాకతో టాలీవుడ్ కు ఉజ్వల భవిష్యత్తు ఉందన్న నమ్మకం “మను” వంటి సరికొత్త సినిమాలు విడుదలవుతున్న సమయంలో కలుగక మానదు. సెప్టెంబర్ 7వ తేదీన విడుదల కాబోతున్న “మను” సినిమా ట్రైలర్ విడుదలైంది. సోషల్ మీడియాలో భారీ ప్రచారం జరిగిన ఈ ట్రైలర్ అంచనాలను మించిన విధంగా ఉండడం విశేషం.

చిన్న సినిమా అయినా క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీపడలేదని ప్రొడక్షన్ వాల్యూస్ చెప్తున్నాయి. బ్రహ్మానందం తనయుడు గౌతమ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో చాందిని చౌదరి మరో కీ రోల్ చేసింది. నరేష్ కుమరన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో “వావ్” అనిపించే విధంగా ఉన్న ఈ ట్రైలర్ గురించి చెప్పడం కన్నా చూడడం మెరుగు.

అంతా చూసిన తర్వాత రిలీజ్ డేట్ ఎప్పుడు అనిపించడం సినీ ప్రేమికులకు సహజమే. ఈ సినిమాలో ఉన్న మిస్టరీని సెప్టెంబర్ 7వ తేదీన రివీల్ చేస్తామని ప్రకటించడంతో వీక్షకుల రిలీజ్ డేట్ ప్రశ్నకు సమాధానం లభిస్తుంది గానీ, ఈ ట్రైలర్ ద్వారా కలిగిన మిస్టరీ ప్రశ్నకు మాత్రం ఆన్సర్ లభించదు. మరి అంతలా ఆసక్తి రేపుతోన్న ఈ ట్రైలర్ వీక్షించేయండి!