Manu -Movieబ్రహ్మానందం తనయుడు గౌతమ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన “మను” సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆసక్తికరంగా సాగిన ఈ సినిమా ట్రైలర్ వీక్షకులను మెప్పించడంలో సక్సెస్ కావడంతో, “మను”పై ఇండస్ట్రీ వర్గాల్లోనూ, సినీ ప్రేక్షకులలోనూ ఒక రకమైన పాజిటివ్ ఫీలింగ్ ఉంది. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ప్రధాన అప్ డేట్ వెలువడింది.

థ్రిల్లర్ గా తెరకెక్కిన సినిమాలు సాధారణంగా చాలా తక్కువ నిడివి ఉంటాయి. రెండు గంటల వ్యవధిలో ఉండే థ్రిల్లర్ జోనర్ ను దాదాపుగా మూడు గంటల నిడివితో “మను” తెరకెక్కించినట్లుగా స్పష్టం చేసారు. ఈ 180 నిముషాల నిడివిలో కేవలం 45 నిముషాల పాటు మాత్రమే డైలాగ్స్ వినిపిస్తాయట. మరి మిగిలిన 135 నిముషాల పాటు ఏం జరుగుతుంది? అంటే, దానికే సినిమా చూడమంటున్నారు.

ఈ 135 నిముషాలలో ఎక్కువగా శాతం సైలెన్స్, ష్…, బ్యాక్ గ్రౌండ్ స్కోర్… తదితర అంశాలు నిండి ఉంటాయట. ‘బాహుబలి 2’ వంటి అడ్వెంచర్స్ సినిమాలు, ‘రంగస్థలం, భరత్ అనే నేను’ వంటి కమర్షియల్ సినిమాల నిడివి మూడు గంటలు పాటు ఉండడమే చర్చనీయాంశం కాగా, ఓ థ్రిల్లర్ ను 3 గంటల పాటు ఎంత విజయవంతంగా నడిపారో ఈ నెల 7వ తేదీన తేలనుంది.