Manmadhudu - 2 Teaser Talkఅక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న ‘మన్మథుడు 2’ టీజర్‌ విడుదలైంది. లేటు వయసులో పెళ్లికి రెడీ అయిన ఒక అందగాడికి ఎదురయ్యే ఇబ్బందులు అక్కడి నుండి పెళ్లి అవసరం లేదు కాకపోతే అమ్మాయిలు కావాలి అంటూ చేసే హడావిడే మన్మథుడు 2 కథ. ఎప్పుడో వచ్చిన మన్మధుడు టైం లో నాగార్జున ఎలా ఉన్నాడో ఇప్పుడూ అలానే ఉన్నాడు. దానితో కోడలు వచ్చినా మన్మథుడు అనే టైటిల్ తో సినిమా తీయగలుగుతున్నాడు. అందుకు తగ్గట్టుగానే ఆకర్షణీయంగా ఉన్నారు.

టీజర్‌ చివర్లో నాగ్‌ స్టైల్‌గా.. ‘ఐ డోన్ట్‌ ఫాల్‌ ఇన్‌ లవ్‌.. ఐ ఓన్లీ మేక్‌ లవ్’ అని చెబుతున్న డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది. ఇందులోనే మొత్తం సినిమా స్టోరీ చెప్పేశాడు దర్శకుడు. కథ బట్టి సినిమాలో కామెడీకి మంచి స్కోప్ ఉంది. అది గనుక క్లిక్ అయితే నాగార్జున హిట్ కొట్టడం తేలికే. రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆగస్ట్‌9న ప్రేక్షకుల ముందుకు రానుంది. అంటే ప్రభాస్ సాహో చిత్రానికి వారం గాప్ కూడా లేదు. ఇది ఒకరకంగా సాహసం అనే చెప్పుకోవాలి.

ఇందులో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, కీర్తి సురేశ్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. నాగార్జున కోడలు సమంత అతిథి పాత్రలో కన్పించనున్నారు. వెన్నెల కిషోర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. చైత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందించగా.. ఎం.సుకుమార్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు. 2016లో వచ్చిన ఊపిరి తరువాత నాగార్జునకు సరైన హిట్ లేదు. ఆ సినిమా తరువాత వచ్చిన ఐదు సినిమాలు ప్లాపులుగా మిగిలిపోయాయి. ఈ చిత్రంతో పాత బాకీ తీర్చాలని కసిగా ఉన్నాడు నాగ్.