Manmadhudu - 2 - movie copied from Frnch movie Prête-moi ta mainఅక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న ‘మన్మథుడు 2’ ఫస్ట్ లుక్ టీజర్‌ నిన్న విడుదలైంది. లేటు వయసులో పెళ్లికి రెడీ అయిన ఒక అందగాడికి ఎదురయ్యే ఇబ్బందులు అక్కడి నుండి పెళ్లి అవసరం లేదు కాకపోతే అమ్మాయిలు కావాలి అంటూ చేసే హడావిడే మన్మథుడు 2 కథ. ఈ టీజర్ బావుంది అని కొందరు అనగా కొందరు మాత్రం నాగార్జున కు 60 ఏళ్ళు వచ్చాక కూడా అమ్మాయిలతో ఆ ముద్దులేంటి అని పెదవి విరుస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా వేరే వివాదంలో చిక్కు కుంది.

టీజర్ చుసిన కొంత మంది ఈ సినిమా 2006లో వచ్చిన ఒక ఫ్రెంచ్ సినిమా కథ ను పోలి ఉందని అంటున్నారు. ‘ప్రేతే మొయి తా మై’ అనే ఆ సినిమాలో ఒక నలభై ఏళ్ల హీరో పెళ్లి చేసుకోమని ఇంట్లో అందరూ పోరు పెడుతుంటే ఒక అమ్మాయిని పెళ్ళాంగా అద్దెకు తెచ్చుకుంటాడు. కొంత రెండు కథలు దగ్గరగా ఉన్నాయి గానీ ఒక్క టీజర్ తోనే సినిమా కాపీ అని చెప్పలేం. బహుశా ట్రైలర్ విడుదల అయ్యాక ఒక ఐడియా రావొచ్చు. గత ఏడాది చిలసౌ వంటి మంచి సినిమాతో డైరెక్టర్ అవతారం ఎత్తిన రాహుల్ ర‌వీంద్ర‌న్‌ ఈ సినిమాకు దర్శకుడు.

అక్ష‌ర‌గౌడ‌, ర‌కుల్ ప్రీతి సింగ్, కీర్తి సురేష్ లాంటి భామలు నటిస్తున్నారు. నాగార్జున కోడలు సమంత కూడా చిన్న పాత్ర చేసిందట. 2016లో వచ్చిన ఊపిరి తరువాత నాగార్జునకు సరైన హిట్ లేదు. ఆ సినిమా తరువాత వచ్చిన ఐదు సినిమాలు ప్లాపులుగా మిగిలిపోయాయి. ఈ చిత్రంతో పాత బాకీ తీర్చాలని కసిగా ఉన్నాడు నాగ్. ఈ సినిమా ఆగస్ట్‌9న ప్రేక్షకుల ముందుకు రానుంది. అంటే ప్రభాస్ సాహో చిత్రానికి వారం గాప్ కూడా లేదు. ఇది ఒకరకంగా సాహసం అనే చెప్పుకోవాలి.