Manmadhudu-2-Collectionsకింగ్ నాగార్జున నటించిన మన్మథుడు 2 సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక క్లాసిక్ సినిమా పేరుతో వచ్చిన ఈ సినిమా మొదటి రోజే ప్లాప్ టాక్, ఘోరమైన రివ్యూస్ తో మొదలయ్యింది. అక్కినేని అభిమానులు కూడా ఈ సినిమాపై పూర్తి నిరాశ చెందారు. దీనిబట్టి ఈ సినిమా మొదటి వారాంతంలో కూడా ఆడటం కష్టం అని విశ్లేషకుల అభిప్రాయం. మొదటి రోజు ఈ సినిమాకు 4.89 కోట్ల షేర్ ప్రపంచవ్యాప్తంగా రాబట్టింది. డీసెంట్ ఓపెనింగ్ అని చెప్పుకోవచ్చు.

ఈ సినిమా వరల్డ్ వైడ్ థియేటర్ రైట్స్ వేల్యూ 18.4 కోట్లు. ఆ మేరకు రాబడితేనే సినిమా హిట్ అనవచ్చు. ఈ టాక్ తో ఆ మేరకు రాబట్టడం దాదాపుగా అసంభవం. ఈ వారాంతంలో ఎంత వస్తే అంతే ఫైనల్ అనుకోవచ్చు. స్వాతంత్ర దినోత్సవం సెలవు ఉన్నా ఈ టాక్ తో, పైగా రెండు కొత్త చిత్రాల విడుదలతో పెద్దగా అడ్వాంటేజ్ ఉండకపోవచ్చు. అన్ని ఏరియాలలో ట్రేడ్ కనీసం 50-70% పోతుందని అంచనా వేస్తారు. కొన్ని ఏరియాస్ లో ఈ లాస్ 80% వరకూ ఉండవచ్చని కూడా అంటున్నారు.

మన్మథుడు 2 ప్లాప్ అయితే నాగార్జున కేరీర్ లో ఇది వరుసగా నాలుగో ప్లాప్ అని చెప్పవచ్చు …. నిర్మలా కాన్వెంట్, రాజుగారి గది 2, ఆఫీసర్ ఇప్పటికే ప్లాపులుగా ఉన్నాయి. 2016లో విడుదలైన ఊపిరి తరువాత నాగార్జునకు హిట్ లేదని చెప్పవచ్చు. అక్కినేని అభిమానులు దీనితో కృంగిపోతున్నారు. ఇప్పటికే అఖిల్ కూడా కేరీర్ లో ఒక్క హిట్ కూడా లేకుండా అయ్యింది. ఈ సంవత్సరంలో నాగ చైతన్య మజ్ను, సమంత ఓ బేబీ మాత్రమే అక్కినేని పరువు నిలబెట్టాయి.